గుంటూరు: గత ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే సాంబశివరావుపై వచ్చిన ఆరోపణలు నిజమేనని నిర్థారణ అయ్యింది. నోవా అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినట్లు తేలింది. పావులూరు గ్రామంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రూ.2 లక్షల 39 వేల నగదు పంపిణీ చేసినట్లు అధికారులు గుర్తించారు. దుద్దుకూరు గ్రామంలో రూ.15 లక్షలు పంచినట్లు నిర్ధారణ అయింది.
డబ్బు పంపిణీకి నోవా అగ్రిటెక్ కంపెనీ ఉద్యోగులు అప్పారావు, బుజ్జిబాబు, సాయిగణేష్‌లను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. ప్రలోభాలకు సంబంధించి కీలక డైరీని రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్వాధీనం చేసుకుంది. తదుపరి విచారణ కోసం బాపట్ల జిల్లా పోలీసు, ఐటీ, ఈడీలకు రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సమాచారం అందించారు.
ఇదీ చదవండి: తుప్పు వ్యాపారం చేసే వాడికి ఇంత డబ్బు ఎలా వచ్చింది?: వెల్లంపల్లి
Comments
Please login to add a commentAdd a comment