ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అనకాపల్లి: కరోనా వైరస్ రెండో దశ దేశంలో విలయతాండవం చేస్తోంది. మాయదారి మహమ్మారి ఎంతో మందిని పొట్టన పెట్టుకుంటోంది. అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. కన్నవారికి పిల్లలను పిల్లలకు కన్నవారిని దూరం చేస్తోంది. తాజాగా పెళ్లి భజంత్రీలు మోగాల్సిన ఓ ఇంట్లో పెళ్లి కుమారుడిని కరోనా బలి తీసుకుంది.
స్థానిక బీజీనూకేళ్వరరావువీధికి చెందిన జీవీ నూకేష్(27)కు ఈ నెల 26న వివాహం జరిపేందుకు పెద్దలు నిశ్చయించారు. ఈ నేపథ్యంలో అతనికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో గత 20 రోజుల నుంచి విశాఖలోని విశాఖ అపోలో అస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే దురదృష్టవశాత్తు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నూకేష్ తుదిశ్వాస విడిచాడు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు పాడే ఎక్కడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment