
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో సెప్టెంబర్ 3, ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ఉండనుంది.
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి మరోసారి భేటీ కానుంది. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో సెప్టెంబర్ 3, ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ఉండనుంది. కాగా, ఆగస్టు 19 న జరిగిన సమావేశంలో ‘వైఎస్సార్ ఆసరా’, ‘జగనన్న విద్యా కానుక’, ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ,’ వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్’ పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
(చదవండి: నవరత్నాల అమలులో మరో ముందడుగు)