సాక్షి, విజయవాడ: సీఐడీ విచారణపై తప్పుడు కథనాలు రాస్తున్నారని ఏపీ సీఐడీ అడిషనల్ డీజీపీ ఎన్ సంజయ్ పేర్కొన్నారు. మార్గదర్శి పెద్ద స్కాం అని, చాలా నిబంధనలు అతిక్రమించిందని తెలిపారు. మార్గదర్శి మోసాలపై ప్రజలకు నిజాలు తెలియాలని అన్నారు. కోట్ల రూపాయలు కట్టిన బాధితులకు మార్గదర్శి నుంచి వేలల్లో మాత్రమే ముట్టిందన్నారు. మార్గదర్శి మోసాలపై కొన్ని పత్రికలు తప్పుడు కథనాలు రాస్తున్నాయని మండిపడ్డారు. చిట్స్ నిబంధనలను మార్గదర్శి పాటించడం లేదని విమర్శించారు.
మార్గదర్శి మోసాలపై ఐటీ, ఈడీలకు సమాచారమిచ్చామని సంజయ్ తెలిపారు. కోటికి పైగా చిట్స్ వేసిన బాధితులు 800 మందికి పైగా ఉన్నారని అన్నారు. సీఐడీ అడిషనల్ డీజీపీ మాట్లాడుతూ.. ‘అన్ని రూల్స్ పాటిస్తున్నామని చెబుతూ మోసం చేస్తున్నారు. ఆక్షన్ జరపకుండా నెలలపాటు పొడిగిస్తున్నారు. 40 శాతం చిట్ గ్రూపుల్లో చందాదారులే లేరు. కంపెనీనే సొంతంగా చిట్స్‌ను తీసుకుంటుంది.
ప్రతి చిట్ గ్రూపులో మోసాలు
‘చెక్ ప్రిపేర్ అయినా లెడ్జర్‌లో వివరాలు పొందుపరచడం లేదు. చందాదారులను బెదిరిస్తూ చిట్ అమౌంట్ ఇవ్వకుండా వేధిస్తున్నారు. ప్రతి చిట్ గ్రూపులో మోసాలు బయటపడ్డాయి. గోస్ట్ సబ్ స్క్రైబర్స్ పేరుతో కంపెనీనే డబ్బులు తీసుకుంటుంది. కొన్ని ప్రాంతాల్లో మార్గదర్శిపైపోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు నమోదయ్యాయి. కొందరు చిట్ వేయకున్నా వారి పేరుతో చిట్స్ నడుస్తున్నాయి. దీనిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది.
అక్రమాలను కవర్ చేసుకుంటూ వార్తలు
మార్గదర్శిలో అక్రమాలపై కవర్ చేసుకుంటూ ఈనాడులో రాసుకుంటున్నారు. మార్గదర్శికి అనుకూలంగా.. చిట్ ఫండ్ నిర్వహణలో తప్పులు లేనట్లు సొంత పేపర్‌లో రాశారు. మేము రాసిందే కరెక్ట్ అన్న ధోరణిలో రామోజీ, శైలజా కిరణ్‌లు ఉన్నారు. ఈనాడు రాస్తోంది కరెక్ట్ కాదు. అందుకే ప్రజలకు వివరాలు వెల్లడిస్తున్నాం. విచారణకి సహకరించరు.. పైగా రామోజీరావు, శైలజ కిరణ్‌లను మేము ప్రశ్నించకూడదు అంట, మార్గదర్సి చిట్స్ కార్యాలయాలలో తనిఖీలు చేయకూడదట. సీఐడీ బ్రాంచ్‌లలో తనిఖీ చేసినప్పుడు మార్గదర్సి రోజువారీ కార్యకలాపాలకి ఆటంకాలు సృష్టిస్తున్నారని తప్పువు వార్తలు రాస్తున్నారు.
3 వేల మందికి ఆ విషయమే తెలీదు
మార్గదర్శిలో జరిగిన బిజినెస్‌లోనే అక్రమాలు జరుగుతున్నాయి. కోటికి పైగా చిట్‌లో పాల్గొన్న వాళ్లు 800 మందికి పైగా ఉన్నారు. మార్గదర్సిలో చిట్స్ కడుతున్నట్లు దాదాపు 3 వేల మందికి తెలియనే తెలియదు. వంద మంది ఘోస్ట్ సబ్ స్క్రైబర్స్‌ను గుర్తించి విచారించాం. ఘోస్ట్ సబ్ స్క్రైబర్స్‌కు తెలియకుండా వారి ఆధార్, ఇతర వివరాలని మార్గదర్సి వాడుకుంటోంది. ఒక్కో కంపెనీ 20,30, 50 చిట్లు ఎలా వెయ్యగలిగింది.
శైలజా పీఎం నుంచి బెదిరింపు ఫోన్లు
జగజ్జనని కేసులో 9 కోట్ల ఆస్తులు అటాచ్ చేశాం. అనుమతులు లేకుండా చిట్ గ్రూప్‌ను ప్రారంభించారు. వేలం జరగకుండా నాలుగైదు చిట్లు ఎలా కట్టించుకుంటారు. అన్నపూర్ణ దేవిని శైలజ కిరణ్ పీఏ శశికళ నుంచి బెదిరింపు ఫోన్లు వెళ్తున్నాయి. ఇది సీఐడీ విచారణను అడ్డుకోవడం కాదా?. 3 వేల మందికి చిట్ కడుతున్నట్టు వాళ్ళకే తెలియదు.800 మంది అత్యధిక డబ్బులతో నడుస్తున్న చిట్‌ల వివరాలను ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు పంపాం. విజయవాడలో ఒక బిల్డర్ 50 కోట్ల చిట్‌లు వేస్తున్నారు. అవి నగదా, చెక్‌ల రూపంలో చెల్లిస్తున్నారా..? అని విచారిస్తున్నాం’ అని తెలిపారు.
అన్నపూర్ణ దేవి ఇచ్చిన ఫిర్యాదు పై విచారణ జరిపాం. ఫిర్యాదుదారు కుమార్తె ప్రియాంక సంతకాన్ని ఫోర్జరీ చేశారు. విదేశాల్లో ఉన్న ప్రియాంక సంతకాన్ని ఫోర్జరీ చేశారు. వాళ్ళు ఫోర్జరీ సంతకంతో నష్టానికి వేలం పాట పాడించారు. మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లు ఏజెంట్లను మోసం చేస్తున్నారు. నరసరావుపేట బ్రాంచ్‌లో ఏజెంట్ సంతకాన్ని బ్రాంచ్ మేనేజర్ ఫోర్జరీ చేశారు.
-ఫకీరప్ప, ఎస్పీ, సీఐడీ
Comments
Please login to add a commentAdd a comment