సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ ఉద్యోగులు క్షేత్ర స్థాయిలో విధానాల అమలును తమ భుజస్కంధాలపై వేసుకున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్యోగులను రాజకీయాల కోసం వాడుకోవడాన్నిముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సహించరని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం తాడేపల్లిలో సీఎంఓ అధికారులతో ఉద్యోగ సంఘాల నాయకులు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ఉద్యోగుల భద్రతలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండడుగుల ముందే ఉంటారని తెలిపారు. ఉద్యోగులకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కచ్చితంగా వాటిని పరిష్కరిస్తామని పేర్కొన్నారు. సుధీర్ఘంగా ఉన్న ఆర్టీసీ డిమాండ్లను సీఎం జగన్ నెరవేర్చారన్నారు.
చదవండి: ఏపీ హైకోర్టు సీజేగా ప్రశాంత్ కుమార్ ప్రమాణ స్వీకారం
రెండేళ్లుగా కోవిడ్ వల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా మారిందని, దీంతో కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నామని, పీఆర్సీ వంటి సమస్యలపై చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 27శాతం ఐఆర్ హామీ సీఎం జగన్ నెరవేర్చారని గుర్తుచేశారు. పీఆర్సీ ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని, మిగిలిన విషయాలను కూడా క్రమ పద్ధతిలో చేస్తామని భరోసానిచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటుతోపాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వంటివి ఎన్నో కార్యక్రమాలను చేశామని తెలిపారు.
చదవండి: బయటి కన్నా ఇంట్లోని కాలుష్యంతోనే అధిక ముప్పు
‘ఉద్యోగులు లేకపోతే ప్రభుత్వం లేదు. అపోహలు వద్దు. ఎవరేం చెప్పినా నమ్మొద్దు. జీతాల విషయంలో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకుంటాం. ఉద్యోగులను మరింత ఆప్యాయంగా సీఎం చూసుకుంటారు. మిగిలిన సమస్యలు నవంబర్‌లోగా తీరుస్తాం. ఏ ఉద్యోగుల సంఘాలు వచ్చినా, ఉద్యోగులు వచ్చినా మేము స్పందిస్తాం. ఇది ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్. ఉద్యోగుల సమస్యలపై చర్చలు జరుగుతూనే ఉంటాయి. దాంట్లో దాపరికం ఏమీ లేదు. అది రహస్యమైతే బండి శ్రీనివాస్ (ఏపీ ఎన్‌జీఓ అధ్యక్షుడు) పక్కకి వెళ్లి మాట్లాడే వారు కదా.’ అని సజ్జల ప్రశ్నించారు.
చదవండి: గుంటూరు నడిబొడ్డున రూ.130 కోట్లతో నాయుడు కాంప్లెక్స్
ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని, డిమాండ్లను కూడా ఇచ్చామని ఏపీ ఎన్‌జీఓ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ తెలిపారు. ఈ రోజు పెద్దలతో చర్చలు జరిపినట్లు, నెలలోపు పీఆర్సీ అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. త్వరలో జాయింట్ స్టాఫ్ మీటింగ్ జరగబోతోందని, దాంట్లో మిగతా సమస్యలు చర్చిస్తామని పేర్కొన్నారు. ఇందుకు తాము సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.
ప్రభుత్వానికి మంగళవారమే మెమోరాండం ఇచ్చామని, ఈ రోజు చర్చలు జరిగాయని ఉద్యోగ సంఘాల జఘేసీ బొప్పరాజు అన్నారు. తాము 10 సమస్యలను మేము వివరించాము. సీఎంఓ అధికారులతో సజ్జల సమావేశం పెట్టారని, ఈ సందర్భంగా ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒకే రోజు జీతం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. అందరికీ 1వ తేదీన జీతాలు వేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment