
సాక్షి, అమరావతి : ఉభయ గోదావరి జిల్లాల వరద బాధితులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. వరదల కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబానికి రెండు వేల రూపాయలు చెల్లించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సహాయక చర్యలలో పాల్గొంటూనే బాధితులను గుర్తించాలని గోదావరి జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది.
ఈ రోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి వరద ముంపు ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. వరద బాధితులకు సహాయం చేసే విషయంలో ఉదారంగా వ్యవహరించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.