
సాక్షి, అమరావతి : ఆయిల్ పామ్ రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆయిల్‌పామ్ గెలలను టన్ను రూ.18 వేలకు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో పెంచిన ధరను ఏప్రిల్ 20 నుంచి అమలు చేయాలని ఆయిల్ ఫెడ్‌కు నిర్దేశించింది.పెరిగిన రవాణా ఛార్జీలకు అనుగుణంగా.. 15 కి.మీ లోపు దూరానికి మెట్రిక్ టన్నుకు రూ.462.. 16 -30 కి.మీ లోపు దూరానికి మెట్రిక్ టన్నుకు రూ.659.30... 30 కి.మీ పైన ఉంటే మెట్రిక్ టన్నుకు రూ.741 అదనంగా ఇవ్వాలని నిర్ణయించింది.