
సాక్షి, అమరావతి: తిరుపతి రుయా ఘటనపై హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం కౌంటర్ దాఖలు చేసింది. ఆక్సిజన్ సరఫరాలో జాప్యం వల్లే ఘటన జరిగిందని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మృతులకు ఒక్కొక్కరికి రూ.10లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించామని, ఆక్సిజన్ సరఫరా చేసే కంపెనీపై కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. కాగా మే నెలలో తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో కరోనా రోగులు చికిత్స పొందుతున్న ఐసీయూలో ఆక్సిజన్ సరఫరాలో జాప్యంతో 11 మంది బాధితులు మృతి చెందిన సంగతి తెలిసిందే. 7
Comments
Please login to add a commentAdd a comment