
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యాశాఖ 502 టీచర్ పోస్టులతో డీఎస్సీ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. జడ్పీ, ఎంపీపీ స్కూళ్లలో 199 పోస్టులు, మోడల్ స్కూళ్లలో 207 పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే మున్సిపల్ స్కూళ్లలో 15 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టనున్నారు. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ 81 పోస్టులు ఉన్నాయి.
ఇదిలా ఉంటే, డీఎస్సీలో టెట్ మార్కులకు 20% వెయిటేజీ కల్పించారు. నేటి(ఆగస్టు 23) నుంచి సెప్టెంబర్ 17 వరకు ఫీజు చెల్లింపు గడువుగా నిర్దేశించారు. ఈనెల 25 నుంచి సెప్టెంబర్ 18 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. అక్టోబర్ 23న పరీక్ష, నవంబర్ 4న ఫలితాలు వెల్లడించనున్నారు.
చదవండి: (పవన్ తనకు తాను పెద్ద పుడింగి అనుకుంటున్నాడు: మంత్రి రాజా)
Comments
Please login to add a commentAdd a comment