సాక్షి,గుంటూరు: సోషల్ మీడియా యాక్టివిస్ట్ తిరుపతి లోకేష్ హెబియస్ కార్పస్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టులో సోమవారం(నవంబర్ 11) విచారించింది. ఈ కేసు విచారణ సందర్భంగా తిరుపతి లోకేష్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ కు సంబంధించి నవంబర్ ఆరో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకుఉన్నసీసీ ఫుటేజ్ కోర్టుకు సమర్పించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. కేసు తదుపరి విచారణ ఈనెల 25వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
కాగా, ఏపీలో కొద్ది రోజులుగా యథేచ్ఛగా జరుగుతున్న సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులు, అక్రమ నిర్బంధాలపై హైకోర్టు శుక్రవారం(నవంబర్ 8) విచారణ సందర్భంగా తీవ్రంగా స్పందించింన విషయం తెలిసిందే.
అక్రమ నిర్బంధాల విషయంలో పోలీసుల తీరుపై పలు సందేహాలు వ్యక్తం చేసింది.వ్యక్తుల అరెస్ట్ విషయంలో చట్ట నిబంధనలు పాటించి తీరాల్సిందేనని పోలీసులకు తేల్చి చెప్పింది. లేని పక్షంలో తాము జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని, ఆ పరిస్థితి తేవద్దని హెచ్చరించింది.
ఇది వ్యక్తుల స్వేచ్ఛతో ముడిపడి ఉందని, కాబట్టి ఈ విషయాన్ని తేలికగా తీసుకోవద్దని తేల్చి చెప్పింది. చట్ట నిబంధనలు పాటించేలా పోలీసులను చైతన్య పరచాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
విశాఖకు చెందిన సోషల్ మీడియా కార్యకర్త తిరుపతి లోకేష్‌ను సోమవారం తమ ముందు హాజరు పరచాలని పోలీసులను ఇటీవలే కోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు తిరుపతి లోకేష్‌ను పోలీసులు సోమవారం కోర్టు ముందు హాజరుపరిచారు.
ఇదీ చదవండి: అక్రమ నిర్బంధాలపై హైకోర్టు ఆరా.. ఖాకీలపై ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment