అమృత, అభిషేక్‌ల వివాహ మహోత్సవంలో సీఎం వైఎస్ జగన్
సాక్షి,అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామపరిధిలోని సీకే కన్వెన్షన్‌లో ఆదివారం రాత్రి జరిగిన వివాహానికి రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్, వసంతలక్ష్మి దంపతుల కుమార్తె అమృతతో వేంకట సుబ్రహ్మణ్యం, కృష్ణకుమారి దంపతుల కుమారుడు అభిషేక్‌కు వివాహం సందర్భంగా గవర్నర్, సీఎం హాజరై వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరితో పాటు పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు వివాహానికి హాజరయ్యారు.
వధూవరులకు శుభాకాంక్షలు చెబుతున్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్
Comments
Please login to add a commentAdd a comment