మధ్య తరగతికి శుభవార్త.. సరసమైన ధరలకు ఇంటి స్థలాలు | CM YS Jagan Comments In Review Meeting With Collectors And SPs, JCs | Sakshi
Sakshi News home page

మధ్య తరగతికి శుభవార్త

Published Wed, Mar 31 2021 2:55 AM | Last Updated on Wed, Mar 31 2021 11:53 AM

CM YS Jagan Comments In Review Meeting With Collectors And SPs, JCs - Sakshi

కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టడమే మనముందున్న కర్తవ్యం. వ్యాక్సినేషన్‌ ద్వారానే కోవిడ్‌ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కేవలం 6 రోజుల ప్రక్రియ మిగిలి ఉంది. ఇది పూర్తయితే ఇక ఎన్నికలు ముగిసినట్టే. ఆ తర్వాత దృష్టి అంతా వ్యాక్సినేషన్‌ పైనే ఉంటుంది. ఏప్రిల్‌ 1 నుంచి తొలుత అర్బన్‌ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌పై దృష్టి పెడుతున్నాం. వార్డు, గ్రామ సచివాలయాలు యూనిట్‌గా వ్యాక్సినేషన్‌ను ఉధృతంగా చేపట్టాలి. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలి. గురువారం నేనూ వ్యాక్సిన్‌ తీసుకుంటున్నా.
– సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: జిల్లా కేంద్రాల్లోని మధ్య తరగతి ప్రజలకు సరసమైన ధరలకు ఇంటి స్థలాలు ఇవ్వాలన్నది తమ ఉద్దేశమని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఆయా జిల్లా కేంద్రాల్లో కనీసం 100 నుంచి 150 ఎకరాలు సేకరించాలని చెప్పారు. న్యాయ పరంగా చిక్కుల్లేని విధంగా క్లీన్‌ టైటిల్‌తో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం సరసమైన ధరలకు ప్లాట్లను అందిస్తుందని స్పష్టం చేశారు.

వివిధ పథకాలు, కార్యక్రమాల అమలుపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు.. ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కేంద్రాల్లో మధ్య తరగతి ప్రజలకు ఇచ్చే ఇళ్ల స్థలాల్లోని లే అవుట్లలో సీసీ రోడ్లు, ఫుట్‌పాత్‌లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, పార్కులు, ఓపెన్‌ ఎయిర్‌ జిమ్, వాకింగ్‌ ట్రాక్స్, ఎలక్ట్రిసిటీ లైన్స్, పచ్చదనం, స్మార్ట్‌ బస్‌స్టాప్‌లు.. తదితర సౌకర్యాలన్నీ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్లాట్లకు ఉన్న డిమాండ్‌పై సర్వే చేయాలని, ఆ డిమాండ్‌ను అనుసరించి భూమిని సేకరించాలని సూచించారు. ఎంఐజీ –1లో 150 చదరపు గజాలు, ఎంఐజీ–2లో 200 గజాలు, ఎంఐజీ– 3లో 240 గజాల కింద ప్లాట్లు ఇవ్వనున్నామని, ఒక కుటుంబానికి ఒక ప్లాటు ఇస్తామని చెప్పారు. ఏప్రిల్‌ నెలాఖరులో పాఠశాలల్లో రెండో విడత నాడు – నేడు పనులు చేపట్టాలన్నారు. కొన్ని చోట్ల పెయింటింగ్‌ పనులు తప్ప, మొదట విడత 15,715 పాఠశాలల్లో నాడు–నేడు కింద పనులు పూర్తయ్యాయని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. 15 రోజుల్లో పెయింటింగ్‌ పనులు పూర్తవుతాయని తెలిపారు. మన బడి  నాడు–నేడు కింద చేపట్టిన పనులపై జాయింట్‌ కలెక్టర్‌తో కలిపి కలెక్టర్లు సమీక్షించాలని సీఎం ఆదేశించారు.

నాడు– నేడు పనులపై మూడవ పార్టీ ఏజెన్సీతో క్షేత్ర స్థాయిలో అడిటింగ్‌ చేయించాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా పాఠశాలల్లో పనులు సరిగ్గా జరిగాయా? లేదా? అన్న దానిపై పరిశీలన చేయించాలని సూచించారు. పెయింట్‌ పనులు కూడా వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఏప్రిల్‌ నెలాఖరున నాడు–నేడు కింద అభివృద్ధి చేసిన స్కూళ్లను ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. తర్వాత రెండో విడతలో మిగిలిన స్కూళ్లలో నాడు–నేడు పనులు చేపడతామన్నారు. పాఠశాలలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచడానికి ఎస్‌ఓపీ (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌) తయారు చేయాలని, స్కూల్లో ఏదైనా సమస్య వస్తే వెంటనే దాన్ని పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే..

సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా 55,607 అంగన్‌ వాడీ సెంటర్లు
► రాష్ట్రంలో 55,607 అంగన్‌ వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చబోతున్నాం. వీటిలో ఇంగ్లిష్‌ మీడియంలో బోధన ఉంటుంది. గోరుముద్ద, టాయిలెట్ల నిర్వహణ, అలాగే రెగ్యులర్‌ నిర్వహణపై ఎస్‌ఓపీ రూపొందించాలి.

► అంగన్‌వాడీల్లో నాడు–నేడు కింద 2021–22 లో 20,011 కేంద్రాలు, 2022–23లో 16,072, 2023–24లో 8,036 కేంద్రాల్లో అభివృద్ధి పనులు, కొత్తవాటి నిర్మాణాలు చేపడుతున్నాం. 16,681 చోట్ల అభివృద్ధి పనులు, 27,438 చోట్ల కొత్త భవనాల నిర్మాణంతో పాటు మరో 11,488 అంగన్‌వాడీల్లో నాడు– నేడు పనులను పాఠశాల విద్యా శాఖ చేపడుతోంది.

► ఏప్రిల్‌ మూడో వారంలో ఈ పనులు ప్రారంభించాలి. ఏప్రిల్‌ 15 లోగా అవసరమైన వాటికి స్థలాలను గుర్తించాలి. అంగన్‌వాడీలకు శిక్షణ ఇవ్వడంపై దృష్టి పెట్టాలి.

స్పందన వినతులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి
► స్పందనలో వచ్చే అర్జీలు పరిష్కారానికి నోచుకోవాల్సిందే. నిర్ణీత సమయంలోగా ప్రజలకు సేవలు అందాలి.  దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. 540 సేవలకు సంబంధించి స్పందన కింద అర్జీలు స్వీకరించాలి. నిర్ణీత సమయంలోగా మనం వాటిని పరిష్కరించడంపై దృష్టి పెట్టాలి. 

► స్పందన కార్యక్రమం 2020 జూన్‌ 9న ప్రారంభమైంది. అప్పటి నుంచి రైస్‌ కార్డు, పింఛన్‌ కార్డు, ఇళ్ల స్థలాలు, ఆరోగ్యశ్రీ కార్డు కేవలం ఈ నాలుగు అంశాలకు సంబంధించి 48,96,219 వినతులు వచ్చాయి. పెన్షన్‌ కార్డు, రైస్‌ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఇంటి పట్టాలకు సంబంధించిన అర్జీలను 95 శాతం నిర్ణీత సమయంలోగా పరిష్కరించాం.

► స్పందన వెబ్‌సైట్‌ను కూడా మెరుగు పరిచాం. వినతులు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తుంది. ఒకవేళ అర్జీ ఏ స్థాయిలోనైనా నిలిచిపోతే వెంటనే అలర్ట్స్‌ కూడా వస్తాయి. గ్రామ సచివాలయ స్థాయి నుంచి పై స్థాయిలో ఉన్న సెక్రటరీ లెవల్‌ వరకు ఈ విధానం ఉంటుంది.

జూన్‌లో చేయూత కింద మహిళలకు డబ్బులు 
► జూన్‌లో వైఎస్సార్‌ చేయూత కింద మహిళలకు డబ్బులు చెల్లిస్తాం. పాల వెల్లువ, జీవ క్రాంతి కింద మహిళల సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం బ్యాంకులతో టై అప్‌ అయిన యూనిట్లను వెంటనే అందించేలా చర్యలు తీసుకోవాలి. ఏప్రిల్‌ 10 లోగా మిగిలిన వారికి ఈ యూనిట్లు అందించేలా తగిన చర్యలు తీసుకోవాలి.

► ప్రభుత్వ పథకాలకు సంబంధించి అర్హులు ఎవ్వరూ మిగిలిపోకుండా చర్యలు తీసుకోవాలి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సోషల్‌ ఆడిటింగ్‌ చేయించాలి.

ఏప్రిల్, మే నెలలో అమలు చేసే పథకాలు, కార్యక్రమాలు
► ఏప్రిల్‌ 13న వలంటీర్లకు సత్కారం ప్రారంభం
ఏప్రిల్‌ 16న జగనన్న విద్యా దీవెన : ఇకపై ఈ పథకం కింద నేరుగా విద్యార్థి తల్లి ఖాతాలో డబ్బు జమ. ప్రతి త్రైమాసికం డబ్బులు తల్లు అక్కౌంట్లోకి. ఫీజు రియింబర్స్‌మెంట్‌ బకాయిలు లేకుండా విడుదల చేశాం. 
► ఏప్రిల్‌ 20న వైఎస్సార్‌ సున్నా వడ్డీ (రబీ–2019కి) డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. బ్యాంకర్లు డేటాను అప్‌లోడ్‌ చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి.
► ఏప్రిల్‌ 23న వైఎస్సార్‌ సున్నా వడ్డీ (డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు) డబ్బులు నేరుగా డ్వాక్రా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేస్తాం. 
► ఏప్రిల్‌ 28న జగనన్న వసతి దీవెన కింద డబ్బులు తల్లి ఖాతాలో జమ చేస్తాం. 
► ఏప్రిల్‌ మూడో వారంలో అంగన్‌వాడీల్లో నాడు– నేడు కింద పనులు ప్రారంభిస్తాం.
► ఏప్రిల్‌ ఆఖరులో మన బడి నాడు– నేడు రెండో విడత పనులు ప్రారంభం.
► మే 13న వైఎస్సార్‌ రైతు భరోసా కింద అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ.
► మే 18న మత్స్యకార భరోసా కింద మత్స్యకారులకు నగదు జమ.
► మే 25న ఖరీఫ్‌ బీమా (2020) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement