
సాక్షి, అమరావతి: దేశంలో నాలుగు సాగునీటి కట్టడాలను ప్రపంచ వారసత్వ కట్టడాలుగా ఐసీఐడీ (ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్) గుర్తిస్తే.. అందులో ధవళేశ్వరం బ్యారేజీ ఉండడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుని అభినందించారు.
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో.. ఐసీఐడీ కాంగ్రెస్ విశేషాలను మంత్రి అంబటి వివరించి ఐసీడీసీ ప్రదానం చేసిన పత్రాన్ని సీఎంకు చూపించారు. వచ్చే ఏడాది విశాఖలో ఐసీఐడీ 25వ కాంగ్రెస్‌ను ఘనంగా నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment