సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలను, మాట్లాడిన భాషను చంద్రబాబు నాయుడు సమర్థిస్తున్నారా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. రాష్ట్ర డీజీపీని పాలేరు అంటూ వ్యాఖ్యలు చేస్తారా అంటూ మండిపడ్డారు. టీడీపీ హయాంలోనూ డీజీపీ పనిచేశారని, ఒక ఐపీఎస్ అధికారిని ఇలా మాట్లాడటం హేయమన్నారు. ప్రజల సింపతి కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని, వైఎస్సార్సీపీపై బురదజల్లే ప్రయత్నం టీడీపీ నేతలు చేస్తున్నారని విమర్శించారు.
చదవండి: పట్టాభి మాట్లాడింది.. దారుణమైన భాష: ఏపీ డీజీపీ
టీడీపీ పార్టీ పని అయిపోయిందని, ప్రతిపక్ష పార్టీ ఎన్ని కొంగ జపాలు చేసిన ప్రజలు నమ్మరని అన్నారు. గతంలో ఎన్ని కుట్రలు, హత్యలు చేయించారో ప్రజలకు తెలుసన్నారు. పట్టాభి మాట్లాడింది తప్పు అని చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులను తక్కువ చేసి మాట్లాడితే ఎవరూ ఊరుకోరని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ, ముఖ్యమంత్రిని తిట్టడం తప్పని చెప్పి నిరాహార దీక్షకు కూర్చోవాలన్నారు. పట్టాభి వ్యాఖ్యలపై చట్టప్రకారం అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
చదవండి: పట్టాభి అనుచిత వ్యాఖ్యలు: ఏపీలో వైఎస్సార్‌సీపీ నిరసనలు
Comments
Please login to add a commentAdd a comment