
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేతలకు పనేమీ లేదని ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. మంత్రి అంబటి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల్లోకి మరింత ఉధృతంగా వెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈ నెల రోజుల్లో ప్రతీ గడప గడపకూ వెళ్తున్నాము. ప్రజలకి మేము చేసింది చెప్తున్నాం. నెలలో 20 రోజులు ప్రజల్లోనే ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రజల వద్దకు వెళ్లినప్పుడు ఇంకా ఏమైనా ఫిర్యాదులు చేస్తే.. వాటిని వెంటనే పరిష్కారించే దిశగా ప్రయత్నం చేయాలని సీఎం జగన్ చెప్పారు.
పథకాలు అందడం లేదంటే.. అందుకు గల కారణం కనుక్కోవాలని సీఎం జగన్ తెలిపారు. టీడీపీ వారికి పనేమీ లేదు.. గడప గడప కార్యక్రమంపై విమర్శలు చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్తే వాస్తవం తెలుస్తుంది. సీఎం జగన్ ఇస్తున్న పథకాలు, పరిపాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. టీడీపీ వాళ్లతో పాటు అన్ని పార్టీల వారికి సంక్షేమ పథకాలు అందాయి. లక్ష 50వేల కోట్ల నిధులు నేరుగా ప్రజలకి అందాయి. 151 స్థానాలు కాదు. ఈ సారి కుప్పంతో కలిపి 175 గెలుస్తాం అని తెలిపారు.
ఇది కూడా చదవండి: మీ సత్తా ఏమిటో ఆత్మకూరు ఉప ఎన్నికల్లో తేల్చుకోవాలి.. బీజేపీకి సవాల్