
అమరావతి: శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజలందరికి నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. సీతారాముల కళ్యాణాన్ని ప్రజలు వేడుకగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. సీతారాముల, దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిలషించారు. కరోనా విపత్తును ఎదుర్కొనే శక్తి ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని వైఎస్ జగన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment