
సాక్షి, విజయవాడ: వైజాగ్ స్టీల్‌ప్లాంట్ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి మరోసారి లేఖ రాశారు. స్టీల్‌ప్లాంటును ప్రైవేటీకరించవద్దని, కేంద్రం నిర్ణయం మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోరిన సీఎం జగన్, తనతో పాటు అఖిలపక్షాన్ని కూడా తీసుకువస్తానని పేర్కొన్నారు.
‘‘కేంద్ర ప్రకటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. విశాఖ స్టీల్‌ప్లాంట్ ఆంధ్రుల మనోభావాలతో ముడిపడిన అంశం. స్టీల్‌ప్లాంట్‌పై ప్రత్యక్షంగా 20వేల కుటుంబాలు ఆధారపడ్డాయి. అఖిలపక్షం, కార్మిక సంఘాల ప్రతినిధులను వెంట తీసుకొస్తాం. ఏపీ ప్రజలు, కార్మికుల అభిప్రాయాలను మీ ముందు ఉంచుతాం. ప్లాంట్ పునరుద్ధరణకై మన ముందున్న ఆప్షన్లను నేరుగా వివరిస్తాం’’ అని సీఎం వైఎస్ జగన్ తన లేఖలో పేర్కొన్నారు. ప్లాంట్‌పై దృష్టిపెడితే కచ్చితంగా లాభాల్లోకి వచ్చే అవకాశం ఉందని పునరుద్ఘాటించారు.
Comments
Please login to add a commentAdd a comment