
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు 43 లక్షలు దాటాయి. బుధవారం ఉదయం 9 గంటల సమయానికి 43,08,762 టెస్టులు జరిగినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది. బుధవారం ఒక్కరోజే 71,692 టెస్టులు చేయగా, 10,418 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9,842 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, 74 మంది కోవిడ్ కారణంగా మృతి చెందారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 5,27,512కు చేరుకుంది. 4,25,607 మంది కరోనా నుంచి కోలుకోగా, 97,271 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య 4,634కు చేరింది. రాష్ట్రంలో మిలియన్ జనాభాకు 80,688 టెస్టులు చేస్తూ దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది.