
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 62,938 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా 10,171 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,06,960 కు చేరింది. తాజా పరీక్షల్లో 29,154 ట్రూనాట్ పద్ధతిలో, 33,784 ర్యాపిడ్ టెస్టింగ్ పద్ధతిలో చేశారు. కొత్తగా 7,594 మంది వైరస్ బాధితులు కోలుకుని శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,20,464 కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 84,654 యాక్టివ్ కేసులున్నాయి. వైరస్ బాధితుల్లో తాజాగా 89 మంది మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 1842 కు చేరింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 23,62,270 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వెల్లడించింది.
(దురుసు ప్రవర్తన, జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్ట్)
Comments
Please login to add a commentAdd a comment