సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన ‘కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్’ విజయవంతంగా ముగిసినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 13 జిల్లాల్లో జిల్లాకు మూడు చోట్ల చొప్పున 39 చోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ (మాక్ డ్రిల్) నిర్వహించారు. మొత్తం 956 మంది పాల్గొన్నారు. ఈ డ్రై రన్ ప్రక్రియ వీడియో ద్వారా చిత్రీకరించారు. కార్యాచరణ నివేదికను జిల్లా, రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్‌కు అందించనున్నారు. (చదవండి: కొత్త కరోనా టెన్షన్: ఈ మార్గదర్శకాలు తప్పనిసరి)
కోవిడ్–19 వ్యాక్సినేషన్‌కు సన్నద్ధతలో లోటుపాట్లు పరిశీలించి సరిదిద్దుకోవడానికి డ్రై రన్ ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన డ్రై రన్‌లో భాగంగా డిసెంబర్ 28న విజయవాడలోని ఐదు కేంద్రాల్లో డ్రై రన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. శనివారం కూడా ఏపీ వ్యాప్తంగా డ్రై రన్ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment