
సాక్షి, అమరావతి: సమ్మె సమయంలో మున్సిపల్ కార్మికులపై నమోదైన కేసులను ఉపసంహరిస్తూ ఏపీ హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. సమ్మె సందర్భంగా మున్సిపల్ కార్మికులపై నమోదైన కేసులను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
2023 డిసెంబరు 26 నుంచి 2024 జనవరి 11 తేదీ వరకూ నిర్వహించిన సమ్మె కాలంలో మున్సిపల్ అధికారుల ఫిర్యాదుల్ని వెనక్కు తీసుకుంటున్నట్టు వెల్లడించింది.
ఈ మేరకు డీజీపీకి పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి లేఖ రాశారు. ఏలూరు, విశాఖ, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, కడపలలో నమోదైన కేసులను ఉపసంహరిస్తున్నట్టు హోంశాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment