
సాక్షి, కృష్ణా జిల్లా/జి. కొండూరు: టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అరెస్టు నేపథ్యంలో డీఎస్పీ కీలక వివరాలు వెల్లడించారు. ఫిర్యాదు ఇవ్వాల్సిందిగా సుమారు 4 గంటల పాటు దేవినేని అడిగామని.. అయినా కారులో నుంచి దిగకుండా ఆయన పోలీసులను ఇబ్బంది పెట్టారన్నారు. ‘‘ఫిర్యాదు ఇవ్వకపోగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవరించారు. తన వర్గాన్ని రెచ్చగొట్టి దాడులకు పాల్పడేలా దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రోత్సహించారు.
పోలీస్ స్టేషన్‌కు ఎవరైనా ఫిర్యాదు చేసేందుకు రావచ్చు. ఇరువర్గాలపైనా కేసులు నమోదు చేశాం. ఓ వర్గానికి చెందిన 18 మందిపై, మరో వర్గానికి చెందిన ఆరుగురిపై కేసులు నమోదు చేశాం. దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తాం’’ అని డీఎస్పీ తెలిపారు.
కాగా జి.కొండూరుకి చెందిన వైఎస్సార్‌సీపీ నేత పాలడుగు దుర్గాప్రసాద్‌పై టీడీపీ నేతలు దాడి చేసిన సంగతి తెలిసిందే. దళిత కార్యకర్త సురేష్‌పై కూడా దేవినేని ఉమా అనుచరులు కూడా రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో దాడులకు ప్రేరేపించిన దేవినేని ఉమాను మంగళవారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment