సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయలేక ఎవడి మీదనో ఆధారపడి రాజకీయాలు చేసే చంద్రబాబుపై తమకు వ్యక్తిగత కక్ష ఎందుకు ఉంటుందని మాజీ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. ఆయన మంగళవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లా డుతూ.. ‘రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్ర బాబు కుటుంబాలు విరుద్ధమైన రాజకీయ పార్టీల్లో ఉన్నాయి.
అప్పు డెప్పుడూ లేని వ్యక్తిగత కక్ష ఇప్పుడే వచ్చిందా? సీఎం జగన్‌కు ఎందుకు వ్యక్తిగత కక్ష ఉందో బాబు చెప్పాలి. 2012లో వ్యక్తిగత కక్షతోనే సోనియాగాంధీతో కలిసి వైఎస్ జగన్‌ను అరెస్టు చేయించావని అంగీకరిస్తావా’ అని ప్రశ్నించారు. ‘చంద్రబాబు స్కిల్ స్కామ్‌లో ప్రజాధనాన్ని దోచేసి, పక్కా ఆధారాలతో దొరికిపోయాడు కాబట్టే ఏసీబీ కోర్టు రిమాండ్ విధించి, జైలుకు పంపింది. ఢిల్లీ నుంచి పెద్ద లాయర్లతో వేయించిన క్వాష్ పిటిషన్‌ను కూడా హైకోర్టు తోసిపుచ్చింది. చంద్రబాబు గతంలో 10, 15 శాతం కమీషన్ తీసుకుని బతికేవాడు.
కొడుకు, కుటుంబ సభ్యులు రంగంలోకి వచ్చాక ప్రభుత్వ ఖజానాను మొత్తం దోచేశారు. కుటుంబ సభ్యులు చేసిన కుంభకోణానికి చంద్రబాబు జైల్లో ఉన్నాడు’ అని అన్నారు. ‘చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్డు, రాజధానితో పాటు అన్నింటిలోనూ కుంభకోణాలు చేశారని మేం మొదటి నుంచీ చెబుతున్నాం. ఎన్ని దొంగతనాలు చేసినా ఆయన జోలికి ఎవరూ రారన్న నమ్మకం చంద్రబాబుది. అందుకే ‘నీ బాబే ఏం చేయలేకపోయాడు.. నువ్వేం చేస్తావ్’ అంటూ బీరాలు పలికాడు.
బాలయ్య డైలాగ్‌లా ఫ్లూట్ జింక ముందు ఊదాలి. కానీ చంద్రబాబు సింహం ముందు ఊదాడు. బాబు ప్రచారంలోనే దిట్ట. జనంలో ఆయనకు బలమేమీ ఉండదు’ అని చెప్పారు. ‘టీడీపీని చంద్రబాబు కుల పార్టీగా మార్చారు. ఆయన బడుగు, బలహీనవర్గాల వారికి ముగ్గు రు నలుగురికన్నా రాజ్యసభ సీట్లు ఇచ్చాడా? హైదరాబాద్, బెంగళూరు.. ఇలా అన్ని చోట్లా ర్యాలీలు చేస్తున్నదెవరు? పేదలు చంద్రబాబు కోసం ఏనాడూ పాదయాత్రలు చేయరు.
‘బాబుతో నేను’.. అంటే అందరూ ఆయనతో పాటు జైలుకు వెళ్లాలా’ అంటూ ధ్వజమెత్తారు. ‘బాబును అరెస్టు చేయగానే తిరుణాల్లో తప్పిపోయిన పిల్లాడిలా లోకేశ్ బిత్తర చూపులు చూస్తున్నాడు. ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే అంత పెద్ద నామినేటెడ్ పదవులు ఇస్తానన్నాడు. ఇప్పుడు వాళ్ల నాన్న మీద ఎక్కువ కేసులు పెడుతున్నారని అంటున్నాడు. ఏం నీకు వద్దా పెద్ద పదవి? జైల్లో చంద్రబాబుకు వేడి నీళ్లు ఇవ్వడంలేదని, దోమలు కుడుతున్నాయని భువనేశ్వరి చెప్పడం విడ్డూరం. కోర్టు ఆదేశాల మేరకే జైల్లో సౌకర్యాలు కల్పిస్తారు. జైల్లో దోమలు కుట్టక రంభా ఊర్వశి వచ్చి కన్ను కొడతారా? దోమల మీద చంద్రబాబు దండయాత్ర చేశాడు కదా అవన్నీ పగబట్టి ఉంటాయి’ అని కొడాలి నాని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment