
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం జరిగింది. నూతన న్యాయమూర్తులతో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఏపీ హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, హోం మంత్రి తానేటి వనిత, మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు.
హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా హరినాథ్ నూనెపల్లి, కనపర్తి కిరణ్మయి, జగడం సుమతి, న్యాపతి విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఇటీవల ఈ నలుగురు అడ్వొకేట్‌లను ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.
చదవండి: రాజకీయాల్లో చంద్రబాబు శకం ముగిసింది: మంత్రి చెల్లుబోయిన
Comments
Please login to add a commentAdd a comment