
సాక్షి, అమరావతి: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించడంలో భాగస్వామ్యం వహించేందుకు జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ ముందుకు వచి్చందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. సుమారు రూ.2 లక్షల కోట్లు వెచ్చించి రానున్న మూడేళ్లలో ప్రాథమిక వైద్య కేంద్రాలు సహా ఏపీలోని అన్ని ఆస్పత్రులను ఆధునీకరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.
జాన్స్ హాప్కిన్స్ ప్రతినిధులు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మేకపాటితో సమావేశమయ్యారు. విశాఖలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటులో ముందడుగు దిశగా ఈ యూనివర్శిటీ ప్రతినిధులతో చర్చించినట్లు మంత్రి పేర్కొన్నారు. విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనిస్తోన్న ఏపీ ప్రభుత్వంతో కలిసి ఆ సేవల్లో తామూ భాగస్వామ్యమవుతామని యూనివర్శిటీ ప్రత్యేక ఆసక్తి కనబరచినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, జాన్స్ హాప్కిన్స్ వర్శిటీకి చెందిన అంతర్జాతీయ ప్రొఫెసర్లు, వైద్య నిపుణులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment