మూడు రోజులు వానలే | Heavy rain in Andhra Pradesh for three days | Sakshi
Sakshi News home page

మూడు రోజులు వానలే

Published Mon, May 13 2024 3:35 AM | Last Updated on Mon, May 13 2024 5:34 AM

Heavy rain in Andhra Pradesh for three days

ఉపరితల ఆవర్తన ప్రభావం

సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అంతర్గత కర్ణా­టక, దాని పరిసర ప్రాంతాలపై సముద్ర మ­ట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవ­ర్తనం ఆవరించి ఉంది. మరోవైపు రాష్ట్రంపైకి దక్షిణ, నైరుతి దిశ నుంచి గాలులు వీస్తు­న్నాయి. వీటి ఫలితంగా ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇవి రానున్న 3 రో­జులపాటు కొనసాగనున్నాయి.

ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడా  వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం తెలిపింది. అదే సమయంలో పిడుగులు సంభవించే అవ­కాశం ఉందని పేర్కొంది. గంటకు 30–40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. కాగా ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు అనపర్తి (తూర్పు గోదావరి)లో 3.1, ఆలమూరు (కోనసీమ) 3, పరవాడ (అనకాపల్లి) 2.6, మంగళగిరి (గుంటూరు)­లో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement