
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయంపై బుధవారం ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌తో రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఇంజనీర్–ఇన్–చీఫ్ సి.నారాయణరెడ్డిలు భేటీ కానున్నారు. 2017–18 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయానికి ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్‌ను ఇవ్వడంపై వారు చర్చిస్తారు.
2017–18 ధరల ప్రకారం నిధులిస్తేనే.. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి మార్గం సుగమమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాదనతో పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ), కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) పూర్తి స్థాయిలో ఏకీభవిస్తూ ఇప్పటికే కేంద్ర జల్‌శక్తి శాఖకు నివేదిక ఇచ్చాయి. దాంతో 2017–18 ధరల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ఖరారుచేసి ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ ఇచ్చేందుకు జల్‌శక్తి శాఖ కసరత్తు చేస్తోంది.