నైపుణ్యమే యువత భవితకు ఆయుధం | Mekapati Goutham Reddy Says That Skill is the future of youth | Sakshi
Sakshi News home page

నైపుణ్యమే యువత భవితకు ఆయుధం

Published Sat, Sep 26 2020 5:56 AM | Last Updated on Sat, Sep 26 2020 5:56 AM

Mekapati Goutham Reddy Says That Skill is the future of youth - Sakshi

సాక్షి, అమరావతి: నైపుణ్యాలు కలిగిన యువతను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం టెక్‌ మహీంద్ర ఫౌండేషన్, బయోకాన్‌ లిమిటెడ్, స్నైడర్‌ ఎలక్ట్రిక్‌ వంటి సంస్థలు ప్రభుత్వంతో ఎంవోయూ ఏర్పాటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగించారు.

► కీలక సంస్థలు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోవడం వల్ల రాష్ట్ర అభివృద్ధికి పరిస్థితులు దోహదమవుతాయి. మంచి నైపుణ్యం కలిగిన యువతను రాష్ట్రానికి, దేశానికి అందించడానికి ప్రభుత్వం 30 స్కిల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తోంది. 
► స్థానిక యువతకు కంపెనీలు 75% ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం తీసుకువచ్చాం. 
► ఒప్పందం ప్రకారం టెక్‌ మహీంద్ర ఫౌండేషన్‌ విశాఖలో లాజిస్టిక్స్‌ సెక్టార్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయనుంది. 
► బయోకాన్‌ అకాడమీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న స్కిల్‌ కాలేజీల్లో లైఫ్‌ సైన్సెస్‌ డొమైన్‌లో నాలెడ్జ్‌ పార్టనర్‌గా వ్యవహరిస్తుంది. 
► స్కిల్‌ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ చల్లా మధుసూధనరెడ్డి, ఎండీ అర్జా శ్రీకాంత్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement