
సాక్షి, విజయవాడ: ఏపీలో భారీ వర్షాల కారణంగా విజయవాడ జల దిగ్బంధమైంది. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో ఇళ్లలోకి వరద నీరు చేరి బతుకు జీవుడా అంటూ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇలాంటి సమయంలో బాధ్యతలు మరచిని మంత్రి నారా లోకేష్.. నిన్న హైదరాబాద్‌కు వెళ్లి మళ్లీ నేడు విజయవాడకు వచ్చారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నా పట్టించుకోకుండా ఆయన హైదరాబాద్‌కు వెళ్లడంతో ప్రజలు మండిపడుతున్నారు.
విజయవాడలో వరదల్లో చిక్కుకున్న ప్రజలను వదిలి మంత్రి నారా లోకేష్.. ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు వెళ్లారు. కరకట్ట నివాసానికి వరద ముప్పు కారణంగా ఆయన హైదరాబాద్‌కు వెళ్లినట్టు సమాచారం. తిరిగి సోమవారం ఉదయం నారా లోకేష్ విజయవాడకు చేరుకున్నారు. అంతకుముందు కూడా నారా లోకేష్.. ఆదివారం ఉదయమే విజయవాడకు రావడం గమనార్హం. వచ్చిన కొన్ని గంటల్లోనే ఆయన మళ్లీ హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. తూతూ మంత్రంగా వరదల్లో ఉన్న వారిని ఏదో పరామర్శించినట్టుగా కలరింగ్ ఇచ్చి మళ్లీ వెళ్లిపోయారు. అయితే, విజయవాడ, మంగళగిరి నియోజకవర్గం పూర్తిగా వరదల్లో ఉన్నప్పటికీ ప్రజలను పట్టించుకోకుండా లోకేష్.. హైదరాబాద్ వెళ్లడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కూటమి సర్కార్, లోకేష్‌కు ప్రజల మీద ఉన్న శ్రద్ద అని మండిపడుతున్నారు. కొంచెమైనా బాధ్యత లేదా అని ప్రశ్నిస్తున్నారు.
విజయవాడ, మంగళగిరిలోని ప్రజలు వరద ఉద్ధృతితో తిండి, నిద్రలేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. నిన్న రాత్రి హైదరాబాద్‌కి స్పెషల్ ప్లైట్‌లో వెళ్లొచ్చిన నిక్కర్ మంత్రి @naralokesh https://t.co/QXfT2CCQPu pic.twitter.com/8t8dq5hxPw
— YSR Congress Party (@YSRCParty) September 2, 2024
కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసంలోకి వరద నీరు చేరుకుంది.
కరకట్టపై జలదిగ్భందంలో చిక్కుకున్న చిగురు బాలల ఆశ్రమం.
అక్రమంగా నిర్మించిన @ncbn ఇంటికి సమాంతరంగా ఉన్న చిగురు బాలల ఆశ్రమం
చంద్రబాబు ఇంట్లోకి కూడా భారీగా చేరిన వరద నీరు.. కానీ అటువైపు ఎవ్వరినీ రానివ్వకుండా పోలీసులు ఆంక్షల
వరద నీరు వస్తుందని తెలిసి నిన్నే ఆ ఇంట్లో నుంచి బయటికి… pic.twitter.com/uCIRyrtlhu— YSR Congress Party (@YSRCParty) September 2, 2024
బాధితుల ఆవేదన..
వరదల కారణంగా మేము సమస్యలతో సతమతమవుతుంటే మమ్మల్ని కనీసం పరామర్శించడానికి కూడా ఎమ్మెల్యే రాలేదని పాత రాజేశ్వరిపేట వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ వచ్చి ఇక్కడికి సహాయం చేయకపోగా వాళ్ల పబ్లిసిటీ కోసం కొంతమంది వచ్చి ఫోటోలు తీసుకుని… pic.twitter.com/dnfUE1qe4O
— YSR Congress Party (@YSRCParty) September 2, 2024
Comments
Please login to add a commentAdd a comment