
సాక్షి, తాడేపల్లి: వ్యవస్థలను చంద్రబాబు భ్రష్టు పట్టించారని, తన అనుకూల మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. శనివారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘‘టీడీపీకి క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తులు.. ఇప్పుడు న్యాయవ్యవస్థలో ఉన్నారు. మిధున్‌రెడ్డి లేవనెత్తిన అంశంపై కేంద్రం, సుప్రీంకోర్టు దృష్టి సారించాలి. ఏపీ న్యాయవ్యవస్థ తీరుపై ప్రతి ఒక్కరూ స్పందించాలని’’ ఆయన కోరారు. అమరావతి పేరుతో లీటరుపై రూ.2 పెంచినప్పుడు ఎల్లో మీడియా ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. మీడియా దృతరాష్ట్ర దృష్టితో కాకుండా ధర్మదృష్టితో చూడాలని మంత్రి పేర్ని నాని హితవు పలికారు. (చదవండి: హైకోర్టు తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం)
(చదవండి: టీడీపీ లాయర్లే జడ్జిలు)
Comments
Please login to add a commentAdd a comment