ఏపీకి 15 ప్రతిష్టాత్మక పురస్కారాలు | Ministry Of Panchayati Raj: AP Got 15 Prestigious Awards | Sakshi
Sakshi News home page

ఏపీకి 15 ప్రతిష్టాత్మక పురస్కారాలు

Published Fri, Aug 7 2020 9:30 AM | Last Updated on Fri, Aug 7 2020 9:37 AM

Ministry Of Panchayati Raj: AP Got 15 Prestigious Awards - Sakshi

సాక్షి, అమరావతి : గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలకు గాను ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఏకంగా 15 పురస్కారాలు దక్కాయి. ఏటా కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ జాతీయ స్థాయిలో ఇచ్చే అవార్డుల్లో భాగంగా 2020 సంవత్సరానికిగానూ రాష్ట్రానికి ఈ పురస్కారాలు దక్కాయి. ప్రతిష్టాత్మక అవార్డులు సాధించడంపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. (సబ్‌కలెక్టర్లుగా 12 మంది ప్రొబేషనరీ ఐఏఎస్‌లు)

► 2020 సంవత్సరానికి గానూ ఈ–పంచాయత్‌ పురస్కార్‌ కేటగిరి–ఐఐ(ఎ)లో రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. 8 ప.గో. జిల్లాకు సాధారణ కేటగిరిలో జిల్లాస్థాయి పురస్కారం లభించింది. 

► చిత్తూరు జిల్లా బంగారుపాలెం, గుంటూరు జిల్లా మేడికొండూరు, చిత్తూరు జిల్లా రామచంద్రాపురం, వైఎస్సార్‌ కడప జిల్లా చెన్నూరులకు జనరల్‌ కేటగిరిలో దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ పంచాయత్‌ శశక్తికరణ్‌ పురస్కారాలు లభించాయి. 

► విజయనగరం జిల్లా బొందపల్లె మండలంలోని కొండకింద, ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని వేములకోట, గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని అంగలకుదురు గ్రామ పంచాయతీలకు ధిమాటిక్‌ కేటగిరీలో పురస్కారాలు దక్కాయి.

జనరల్‌ కేటగిరిలో తూ.గో. జిల్లా రాయవరం మండలంలోని చెల్లూరు, ప్రకాశం జిల్లా కురిచేడు, గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని కట్టేవరం గ్రామ పంచాయతీలు పురస్కారాలు సాధించుకున్నాయి. 8 గ్రామాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవడంలో విజయనగరం జిల్లాలోని బొండపల్లి, నానాజీ దేశ్‌ముఖ్‌ రాష్ట్రీయ గౌరవ గ్రామసభ పురస్కారం కింద తూ.గో. జిల్లాలోని చెల్లూరు, చైల్డ్‌ ఫ్రెండ్లీ పంచాయత్‌ అవార్డు కింద తూ.గో. జిల్లాలోని మూలస్థానంకు అవార్డులు దక్కాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement