Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Chandrababu TDP Govt Planning To Stop YSR uchitha pantala bheema
పంటల బీమాకు ‘పాత’ర!

రూ.4 లక్షల బీమా పరిహారం అందుకున్నా..పసుపు, కంద, అరటి, తమలపాకు సాగు చేస్తుంటా. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా రైతులకు ఎంతో బాసటగా నిలిచింది. గత ఐదేళ్లలో పైసా ప్రీమియం చెల్లించకుండా రూ.4 లక్షలకు పైగా బీమా పరిహారం పొందా. రూ.2 లక్షల వరకు పంట నష్ట పరిహారం (ఇన్‌పుట్‌ సబ్సిడీ) అందుకున్నా. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పరిహారం జమైంది. రైతాంగానికి ఎంతో ఆసరాగా ఉన్న పథకాన్ని రద్దు చేసి 2019కి ముందు ఉన్న విధానం అమలు చేయాలని నిర్ణయించడం సరికాదు. ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలి.– ముత్తిరెడ్డి శ్రీనివాసరావు, కిష్కిందపాలెం, బాపట్ల జిల్లాసాక్షి, అమరావతి: ఇన్నాళ్లూ తమపై పైసా భారం పడకుండా కష్టకాలంలో ఆదుకున్న డాక్టర్‌ వైఎస్సార్‌ ఉచిత పంటల బీమాకు పాతరేసే దిశగా టీడీపీ సర్కారు సన్నద్ధం కావడం అన్నదాతల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ‘సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తాం.. ఏ ఒక్కటీ ఆపే ప్రసక్తే లేదు. ఇంకా మెరుగైన రీతిలో అమలు చేస్తాం’ అని ఎన్నికల ప్రచార సభల్లో హామీలిచ్చిన చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, ఇతర కూటమి నేతలు వాటిని గాలికి వదిలేశారు. రైతులకు మేలు చేసే వ్యవసాయ సలహా మండళ్లను రద్దు చేసిన కూటమి సర్కారు కన్ను తాజాగా వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకంపై పడింది. ఈ – క్రాప్‌ నమోదు ప్రామాణి­కంగా నోటిఫై చేసిన ప్రతీ పంటకు, సాగు చేసిన ప్రతీ ఎకరాకు యూనివర్శల్‌ బీమా కవరేజ్‌ కల్పిస్తూ ఈ పథకం దేశానికే తలమానికంగా నిలిచింది. అయితే 2019కి ముందు అమలులో ఉన్న పాత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరి­స్తున్నట్టు తొలి సమీక్షలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన రైతన్నల గుండెల్లో గుబులు రేపింది. గత ఐదేళ్లుగా తాము కట్టాల్సిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి పైసా భారం లేకుండా ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్‌ ప్రారంభానికి ముందే నేరుగా తమ ఖాతాల్లో జమ చేసే పరిస్థితి ఇక ఉండదన్న ఆందోళన వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. టీడీపీ సర్కారు తన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకుని ఉచిత పంటల బీమా పథ­కాన్ని కొనసాగించాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. లేదంటే ఉద్యమ బాట పట్టక తప్పదని హెచ్చరిస్తున్నాయి.ఏళ్ల తరబడి ఎదురు చూపులు..1965లో కేంద్రం తెచ్చిన క్రాప్‌ ఇన్సూరెన్స్‌ బిల్లు ఆధా­రంగా ప్రవేశపెట్టిన మోడల్‌ ఇన్సూరెన్స్‌ పథ­కం వివిధ రూపాలు మార్చుకుని ప్రధాని ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)గా 2016 నుంచి దేశ­వ్యాప్తంగా అమలవుతోంది. దీని ప్రకారం నోటిఫై చేసిన వ్యవసాయ పంటలకు ఖరీఫ్‌లో 2 శాతం, రబీలో 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం చొప్పున రైతులు ప్రీమియం చెల్లించగా మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాయి. అయితే ప్రీమియం భారం అధికంగా ఉండడంతో పాటు అవగాహన లేక పలువురు రైతులు సొంతంగా బీమా చేయించుకునేందుకు ముందుకొచ్చేవారు కాదు. రుణాలు తీసుకునే రైతులకు మాత్రం బ్యాంకులు ప్రీమియం రూపంలో నిర్దేశించిన మొత్తాన్ని మినహాయించుకొని మిగతాది అందచేసేవి. అయితే బీమా చేయించుకున్న వారు సైతం ఎంతొస్తుంది? ఎప్పు­డొ­స్తుందో అంతుబట్టక ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.2014–19 పరిహారం రూ.3,411.20 కోట్లే చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడూ కేంద్ర పథకాలపై ఆధార పడడం మినహా అన్నదాతల సంక్షేమం కోసం తపించిన దాఖలాలు లేవు. 2014–19 మధ్య తొలి రెండేళ్లు వ్యవసాయ ఇన్సూరెన్‌స్కీమ్‌ (ఏఐఎస్‌), ఆ తర్వాత పీఎంఎఫ్‌బీవై అమలు చేశారు. ప్రీమియం రూపంలో 2014–19 మధ్యలో రైతులు తమ వాటాగా రూ.1249.90 కోట్లు చెల్లిస్తే, రాష్ట్ర ప్రభుత్వం రూ.1281 కోట్లు చెల్లించింది. హుద్‌హుద్‌ లాంటి పెను తుపాన్, కరువు కాటకాటకాలతో రూ.వేల కోట్ల పంటలను కోల్పోయిన రైతులకు 2014–19 మధ్య దక్కిన పరిహారం కేవలం రూ.3,411.20 కోట్లు మాత్రమే. పైసా భారం పడకుండా.. పాదయాత్ర హామీ మేరకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2019 జూలై 8న వైఎస్సార్‌ ఉచిత పంటల బీమాకు శ్రీకారం చుట్టారు. తొలి ఏడాది పీఎం ఎఫ్‌బీవైతో అనుసంధానించి అమలు చేశారు. 2019 ఖరీఫ్‌ సీజన్‌లో రూపాయి ప్రీమియంతో పథకానికి శ్రీకారం చుట్టగా అనంతరం ఆ భారం కూడా రైతులపై పడకూడదన్న ఆలోచనతో ఖరీఫ్‌–2020 నుంచి నోటిఫైడ్‌ పంటలకు ఉచితంగా బీమా కవరేజ్‌ కల్పించారు. క్లెయిమ్‌లు, సెటిల్‌మెంట్లు, చెల్లింపుల బాధ్యతను కూడా ప్రభుత్వం తన భుజాన వేసుకుంది. తొలి ఏడాది రైతుల వాటా (రూ.468 కోట్ల)తో కలిపి ప్రీమియం రూపంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రూ.971 కోట్లు బీమా కంపెనీలకు చెల్లించింది. యూనివర్సల్‌ కవరేజ్‌కు కేంద్రం ముందుకు రాకపోవడంతో 2020–21, 2021–22 సీజన్లలో పీఎం ఎఫ్‌బీవైతో సంబంధం లేకుండా మొత్తం బీమా పరిహారం ప్రభుత్వమే చెల్లించింది. 2022–23 నుంచి ఫసల్‌ బీమాతో అనుసంధానించి వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశారు. వాతావరణ ఆధారిత పంటలకు మాత్రం గత ప్రభుత్వం సొంతంగానే బీమా పరిహారం చెల్లించింది. ఈ క్రాప్‌ ప్రామాణికంగా.. ఈ క్రాప్‌తో పాటు ఈ కేవైసీ నమోదు ప్రక్రియ పూర్తి కాగానే గత ప్రభుత్వం ఉచిత పంటల బీమా పధకం వర్తించే నోటిఫై చేసిన పంటలకు (స్టార్‌) గుర్తుతో ప్రత్యేకంగా తెలియచేస్తూ రైతులకు భౌతిక రసీదు అందచేసింది. ‘డాక్టర్‌ వైస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం కింద నోటిఫై చేసిన పంటకు ప్రీమియంను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి పంట బీమా చేసింది‘ అని అందులో స్పష్టంగా తెలియచేసింది. ఈ జాబితాలను సామాజిక తనిఖీల్లో భాగంగా ఆర్బీకేల్లో ప్రదర్శించి అభ్యంతరాలను పరిష్కరించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ బీమా పరిహారం అందచేసింది. ప్రీమియం రూపంలో రైతుల వాటాతో కలిపి 2019–24 మధ్య వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రూ.3,022.26 కోట్లు కంపెనీలకు చెల్లించింది. 2019–24 మధ్య 1.91 కోట్ల హెక్టార్లకు బీమా కవరేజీ కల్పించగా 2.04 కోట్ల మంది రైతులకు బీమా రక్షణ లభించింది. రికార్డు స్థాయిలో పరిహారం.. 2014–19 మధ్య 30.85 లక్షల మందికి రూ.3411.20 కోట్ల పరిహారం చెల్లిస్తే 2019–24 మధ్య 54.55 లక్షల మందికి రూ.7,802.05 కోట్ల బీమా పరిహారం అందింది. టీడీపీ హయాంలో 6.19 లక్షల మంది రైతులకు చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.715.84 కోట్ల బకాయిలు కూడా చెల్లించి గత సర్కారు అండగా నిలిచింది. ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం చెల్లించిన బీమా మొత్తం కంటే రూ.3,273.64 కోట్ల మేర అదనంగా లబ్ధి చేకూర్చగా 13.81 లక్షల మంది రైతులు అదనంగా ప్రయోజనం పొందారు. ఏపీ బాటలో పలు రాష్ట్రాలు.. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని దేశంలోనే అత్యుత్తమ పంటల బీమా పథకంగా కేంద్రం గుర్తించింది. ఇన్నోవేషన్‌ కేటగిరి కింద ఉత్తమ బీమా పథకంగా ఎంపిక చేసింది. 2023 ఏప్రిల్‌ 14న కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్‌ అహూజా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని అందించారు. ఏపీ స్ఫూర్తిగా జాతీయ స్థాయిలో పీఎంఎఫ్‌బీవైలో పలుమార్పులు చేసినట్టుగా కేంద్రం ప్రకటించింది. ఏపీ తరహాలో మిగిలిన రాష్ట్రాలు కూడా అమలు చేయాలని సూచించింది. 2023–24 నుంచి మహారాష్ట్ర, మేఘాలయ, ఒడిశా, పుదుచ్చేరి తదితర రాష్ట్రాలు ఏపీ బాటలోనే రూపాయి ప్రీమియంతో పంటల బీమా అమలుకు శ్రీకారం చుట్టాయి. ఉచిత పంటల బీమా పథకాన్ని కేంద్రం సహా పలు రాష్ట్రాలు ప్రశంసించాయి. రూ.1,278.80 కోట్ల ప్రీమియం చెల్లింపులకు ఎగనామం.. 2023–24 సీజన్‌కు సంబంధించి బీమా కవరేజ్‌ పరిధిలోకి వచ్చిన అర్హుల జాబితాను గతంలోనే కేంద్రానికి పంపించారు. ఆ మేరకు రైతుల వాటాతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,278.80 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడం, ప్రభుత్వం మారడంతో ప్రీమియం చెల్లించాల్సిన బాధ్యత టీడీపీ సర్కారుపై ఉంది. అయితే పాత పద్ధతిలోనే పంటల బీమా అమలు చేస్తామని ప్రకటించడం ద్వారా 2023–24 సీజన్‌ ప్రీమియం చెల్లింపులు జరపవద్దని అధికారులకు సీఎం చంద్రబాబు సంకేతాలిచ్చారు. దీంతో 2023–24 సీజన్‌లో వర్షాభావం, వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు బీమా పరిహారం అందే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు 2024–25 సీజన్‌ నుంచి రైతులే చెల్లించేలా చూడాలంటూ మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో వారిపై పెనుభారం పడనుంది. రైతులపై ఏటా రూ.800 కోట్లకుపైగా భారం ఏ పంటైనా సరే జిల్లాలో కనీసం ఐదువేల ఎకరాల్లో సాగైతేనే నోటిఫై చేస్తారు. నోటిఫై చేసిన పంట పెట్టుబడి ఖర్చులను బట్టి బీమా కంపెనీలు ప్రీమియం నిర్దేశిస్తాయి. ఉదాహరణకు వరికి ఎకరాకు రూ.40 వేలు ఖర్చవుతుంటే కనీసం 8 శాతం అంటే రూ.3,200 చొప్పున ప్రీమియం చెల్లిస్తేనే బీమా కవరేజ్‌ కల్పిస్తుంది. ఈ మొత్తంలో ఖరీఫ్‌లో అయితే 2 శాతం, రబీలో 1.5 శాతం చొప్పున రైతులు గతంలో చెల్లించగా మిగతాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించేవి. ఈ లెక్కన నోటిఫై పంటలకు రైతులు తమ వాటాగా ఏటా కనీసం రూ.800 కోట్లకు పైగా ప్రీమియం రూపంలో భరించాల్సి ఉంటుంది. బ్యాంకుల నుంచి రుణాలు పొందని కౌలు రైతులు, సన్న, చిన్నకారు రైతులు సొంతంగానే ప్రీమియం చెల్లించాలి. వీరికి అవగాహన కల్పించకపోవడం, ఆర్ధిక భారం కారణంగా బీమాకు ముందుకు రావడం లేదు. దీంతో పంట నష్టపోతే విపత్తుల వేళ బీమా పరిహారం అందని దుస్థితి నెలకొంటుంది. వైఎస్సార్‌ రైతు భరో­సాను హడావుడిగా అన్నదాతా సుఖీభవగా మార్చే­సి రూ.20 వేలు ఇవ్వకుండా ఇప్పటికే సీజన్‌లో అన్నదాతలను ముంచేసిన టీడీపీ సర్కారు ఇప్పుడు ఉచిత పంటల బీమాను కూడా రద్దు చేసే దిశగా అడుగులు వేయడం పిడుగుపాటుగా మారింది.రూ.2.75 లక్షల పరిహారం ఇచ్చారువైఎస్సార్‌ ఉచిత పంటల బీమా అన్నదాతలను ఎంతో ఆదుకుంది. నోటిఫై చేసిన పంటలు ఈ క్రాప్‌లో నమోదైతే చాలు బీమా వర్తింపచేశారు. మాకు 20 ఎకరాల భూమి ఉంది. పత్తి, శనగ, ఉల్లి సాగు చేస్తుంటాం. 2019–20లో ఒక్క ఉల్లి పంటకే రూ.1.10 లక్షల బీమా పరిహారం వచ్చింది. ఆ తర్వాత రూ.70 వేలు, రూ.42 వేలు, రూ.53 వేలు చొప్పున వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో రూ.2.75 లక్షల బీమా పరిహారం అందింది. రూపాయి ప్రీమియం చెల్లించకపోయినా ఇంత భారీగా పరిహారం దక్కటం ఎంతో ఊరటనిచ్చింది. అన్నదాతలకు ఎంతగానో ఆసరాగా నిలిచిన ఈ ఉచిత పంటల బీమాను కొనసాగించాలి. 2019కి ముందు ఉన్న పంటల బీమా పథకాన్ని కొనసాగిస్తే రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. –గౌర మహేశ్వరరెడ్డి, ఏ.గోకులపాడు, కర్నూలు జిల్లాపాత విధానం సరికాదు..30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నా. 2021 ఖరీఫ్‌లో అరటి పంట దెబ్బతినడంతో రూ.90 వేల పంటల బీమా పరిహారం నేరుగా నా ఖాతాలో జమ చేశారు. దళారుల ప్రమేయం లేకుండా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసింది. ఐదేళ్లూ పైసా కూడా మేం ప్రీమియం చెల్లించలేదు. మా వాటా కూడా ప్రభుత్వమే కట్టింది. చంద్రబాబు ప్రభుత్వం పాత విధానంలో పంటల బీమా అమలు చేస్తామని చెప్పడం సరికాదు.– గనివాడ సన్యాసినాయుడు, పెదమదుపాడ, విజయనగరం జిల్లారైతులు బీమా చేయించుకోలేరు2019కు ముందు టీడీపీ హయాంలో రైతులు బీమా చేయించుకుంటేనే నష్టపరిహారం వర్తించేది. రైతు­లలో చాలా మంది నిరక్షరాస్యులు ఉన్న­ందున అవగా­హన లేక నష్టపోయే ప్రమాదం ఉంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉచిత పంటల బీమాను అమలు చేసింది. 2021లో వర్షాలకు 80 సెంట్లు పొలంలో నష్టపోతే నేరుగా రూ.5,100 పరిహారం ఇచ్చారు. – డి. ప్రభాకర్, తాటితూరు, భీమిలి మండలంరూ.3.80 లక్షల పరిహారం వచ్చిందినేను పైసా ప్రీమియం చెల్లించకపోయినా 2021లో ఖరీఫ్‌లో పంట నష్టపోతే రూ.3.80 లక్షల బీమా పరిహారం జమైంది. గతంలో ప్రీమియం చెల్లించిన తర్వాత కూడా పరిహారం కోసం అధికారులు, కంపెనీల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వచ్చేది. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం ఎంతగానో ఉపయోగపడింది. ఈ పథకాన్ని కొనసాగించాలి.– వీరపురం భీమేష్, గడేకల్లు, అనంతపురం జిల్లారైతుల తరపున ఉద్యమిస్తాం..రైతులపై భారం పడకుండా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాల్సిందే. పాత పద్ధతిలో పంటల బీమా అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించటాన్ని ఖండిస్తున్నాం. పెరిగిన పెట్టుబడి ఖర్చులకు తోడు బీమా ప్రీమియం రైతులకు తలకు మించిన భారమవుతుంది. ప్రీమియం చెల్లించలేక బీమాకు మెజార్టీ రైతులు దూరమవుతారు. ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించకుంటే ఉద్యమిస్తాం.– కె.ప్రభాకరరెడ్డి, ప్రధాన కార్యదర్శి, ఏపీ రైతు సంఘంపాత పద్ధతితో తీవ్ర నష్టంగతంలో క్రాప్‌ లోన్‌ ఆధారంగా రైతులు సాగు చేసిన పంటలకు కాకుండా ఇష్టానుసారంగా ఇన్సు­రెన్స్‌ ఇచ్చేవారు. ఐదేళ్లుగా ఉచిత పంటల బీమా అమలు చేయడం వలన పైసా ప్రీమియం చెల్లించాల్సిన పని లేకుండా సాగు చేసిన పంటకు బీమా పరిహారం నేరుగా అందింది. ఈ పథకాన్ని కొనసాగించాలి. పాత పద్ధతితో తీవ్రంగా నష్టపోతాం.– ఎన్‌.రాజేశ్వరరెడ్డి, సింహాద్రిపురం, వైఎస్సార్‌ జిల్లా

వైఎస్సార్‌సీపీ నేతలతో మాట్లాడుతున్న ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌
అండగా ఉంటాం.. ఆందోళనొద్దు: వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి, కడప: ‘టీడీపీ వర్గీయులు అరాచకాలు సృష్టిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను టార్గెట్‌ చేస్తూ వ్యక్తిగత దాడులు చేస్తున్నారు. కట్టడి చేయాల్సిన ప్రభుత్వం మిన్నకుండిపోయింది. ఇలా ఐదేళ్లలో మనం ఎప్పుడూ దౌర్జన్యాలు చేయలేదు’ అంటూ అనంతపురం జిల్లాకు చెందిన బాధితులు వాపోతుంటే, అధైర్య పడొద్దని.. టీడీపీ దుర్మార్గాలను ధైర్యంగా ఎదుర్కొందామని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పార్టీ శ్రేణులకు భరోసా కల్పించారు. ‘మీ ప్రాంతానికి వస్తా.. మీకు అండగా నిలుస్తా.. ఆందోళన పడొద్దు, అందర్నీ కలుస్తా.. టీడీపీ దుర్మార్గాన్ని దీటుగా ఎదుర్కొందాం’ అని ఊరడించారు. ఆదివారం వైఎస్సార్‌ జిల్లా పులివెందుల క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌ జిల్లాతోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ శ్రేణులు, నాయకులతో ఆయన మమేకమయ్యారు. అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, నేతలు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, వీరాంజనేయులు, మగ్బూల్‌ బాషా, సాంబశివారెడ్డి తదితరులు వైఎస్‌ జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాల అనంతరం ఆ జిల్లాలో చోటుచేసుకున్న పరిణామాల గురించి వివరించారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ ‘పోరాటాలు మనకు కొత్త కాదు. పోరాటం నుంచే పుట్టిన పార్టీ మనది. ఎంతో కాలం టీడీపీ దౌర్జన్యాలు నడవవు. మనోధైర్యం కోల్పోవద్దు. పార్టీ శ్రేణులకు అండగా ఉండండి. టీడీపీ బాధితులను నేను స్వయంగా కలుస్తా. అండగా నిలుస్తా. టీడీపీ దౌర్జన్యాలను సహించేది లేదు. మనందరం కలసికట్టుగా ఎదుర్కొందాం. మన కాలం వస్తోంది. అంత వరకూ కేడర్‌కు భరోసా ఇవ్వాలి’ అని ఆయన పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. హామీలను విస్మరించి దాడులకు ప్రోత్సాహం ‘ప్రజలకిచ్చిన హామీలను విస్మరించి, చంద్రబాబు సర్కార్‌ వైఎస్సార్‌సీపీ కేడర్‌ను టార్గెట్‌ చేసి దాడులను ప్రోత్సహిస్తోంది. గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి లేదు. టీడీపీ సర్కార్‌ వ్యక్తిగత దాడులకు ఉసిగొల్పుతోంది. ప్రజలన్నీ గమనిస్తున్నారు. ధైర్యంగా ఉండండి. పార్టీ తరఫున అండగా ఉంటాం’ అని మాజీ ఎమ్మెల్యేలు ఎస్‌ రఘురామిరెడ్డి, డాక్టర్‌ సుదీర్‌రెడ్డి తదితరులతో వైఎస్‌ జగన్‌ అన్నారు. చంద్రబాబునాయుడు ఇదివరకెన్నడూ లేని రీతిలో దుర్మార్గ సంప్రదాయానికి బీజం వేస్తున్నారని, పద్ధతి మార్చుకోకపోతే ఫలితం అనుభవించక తప్పదన్నారు. మానవత్వం చాటుకున్న వైఎస్‌ జగన్‌ఈత కొడుతూ ప్రాణాపాయ స్థితిలోకెళ్లిన యువకుడుతన అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలింపువైఎస్‌ జగన్‌ సకాలంలో స్పందించి ప్రాణా­పాయ స్థితిలో ఉన్న ఓ యువకుడి ప్రాణాలు కాపా­డారు. ఆదివారం వైఎస్‌ జగన్‌ పులివెందుల నియోజక­వర్గం లింగాల మండలంలో పర్యటించారు. కోమన్నూతల గ్రామానికి చెందిన నారా­యణ స్వామి కుమారుడు నరేష్‌ (25) సాయంత్రం దిగుడు బావి­లో ఈత కొడుతుండగా శ్వాస తీసుకోవడం కష్టమైంది. స్నే­హి­­తులు గమనించి, అతన్ని బైక్‌పై కూర్చోబెట్టుకుని ఆస్పత్రికి ప­యనమయ్యారు. అదే సమయంలో చిన్నకుడాల వద్ద జగన్‌ కా­న్వా­య్‌ ఆగింది. వెంటనే ఆ యువకులు తమ స్నేహితుడి పరిస్థి­తిని కాన్వాయ్‌లో ఉన్న వారికి వివరించారు. 108కు కాల్‌ చేసినా రాలేదని చెప్పారు. విషయం తెలుసుకున్న జగన్‌ ఆలస్యం చేయ­కుండా తన వెంట ఉన్న అంబులెన్స్‌లో ఆ యువకుడిని పులివెందుల ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స చేయడంతో అతడికి ప్రాణాపాయం తప్పింది.మాజీ ఎంపీపీ కుటుంబానికి పరామర్శ వైఎస్సార్‌సీపీ లింగాల మండల కన్వీనర్, మాజీ ఎంపీపీ పెద్ద సుబ్బారెడ్డి సతీమణీ లక్ష్మీనరసమ్మ ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ ఆదివారం పెద్దకూడాల గ్రామంలో వారి కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులందర్నీ పలుకరించి, ధైర్యం చెప్పారు. లింగాల మండలానికి చెందిన వివిధ గ్రామాలకు చెందిన నాయకుల్ని పేరుపేరునా పలుకరించారు. పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. చక్రాయపేట మండలం గొంది గ్రామానికి చెందిన మబ్బు రామయ్య తన పట్టా భూమిలో దౌర్జన్యంగా టీడీపీ వర్గీయులు రోడ్డు వేస్తున్నారని వాపోయారు. అడ్డుకున్న తనపైనే తప్పుడు కేసు బనాయిస్తున్నారని వివరించారు. ఈ ఘటనపై వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ.. బాధితుడికి అన్యాయం చేయొద్దని పోలీసు అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు ఓపికగా విన్నారు. అవసరమైన చర్యలకు సిఫారసు చేశారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కే సురేష్‌బాబు, మున్సిపల్‌ చైర్మన్‌ వరప్రసాద్, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ గోటూరు చిన్నప్ప తదితరులు పాల్గొన్నారు.

CM Revanth Reddy preparing for field visits in Telangana
వారానికో జిల్లాకు సీఎం రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్షేత్ర­స్థాయి పర్యటనలపై దృష్టి పెట్టారు. ఇకపై ప్రతి వా­రం ఒక జిల్లాకు వెళ్లాలని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును సమీక్షించడంతో పాటు ఆ­యా జిల్లాల వారీగా పెండింగ్‌లో ఉన్న పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులకు దిశానిర్దేశం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. తన సొంత జిల్లా పాలమూరు నుంచి ఆయన పర్యటనలు ప్రారంభించనున్నారు. ఈ నెల 9వ తేదీన ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల అమలును సీఎం సమీక్షిస్తారని, ఈ మేరకు అన్ని వివరాలతో సమావేశానికి రా­వాలని క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని జిల్లా­ల కలెక్టర్లు, వివిధ శాఖల అధిపతులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఇప్పటికే ప్రభు­త్వ వర్గాల నుంచి సమాచారం అందింది. కీలక రంగాలపై ఫోకస్‌ జిల్లాల పర్యటనలో భాగంగా కీలక రంగాలపై ఫోకస్‌ పెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్టు తెలిసింది. విద్యాసంవత్సరం ప్రారంభం కానుండడం, వర్షాకాలం నేపథ్యంలో విద్య, వైద్యం, సాగునీటి రంగాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, తీసుకోవాల్సిన చర్యలపై ఆయన సమీక్ష జరుపుతారని సీఎంవో వర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడంపై ఇప్పటికే దృష్టి పెట్టిన సీఎం.. ఆ దిశలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేయనున్నారు. ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ కాంప్లెక్సుల నిర్మాణం, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లుగా ఐటీఐల అప్‌గ్రెడేషన్‌ తదితర అంశాలపై కూడా ఆయన దృష్టి పెట్టనున్నారు. వర్షాకాలంలో వచ్చే అంటు వ్యాధులు, వైద్య శాఖ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ వైద్యరంగ బలోపేతం తదితర అంశాలపై కూడా సూచనలు చేయనున్నారు. ఇక ప్రతి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల గురించి స్థానిక అధికారులతో సీఎం ప్రత్యేకంగా మాట్లాడ­తారని, త్వరగా పూర్తయ్యేందుకు అవకాశం ఉన్న ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించడం ద్వారా వీలైనంత వేగంగా వాటిని పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించేలా అధికారులకు మార్గదర్శనం చే­స్తా­రని సమాచారం. వీటితో పాటు వ్యవసాయ సీజన్‌కు సంబంధించిన కార్యాచరణ, ఎరువుల లభ్యత, ఉపాధి హామీ పనులను సమీక్షించనున్న సీఎం.. రైతుభరోసా అమలు విధివిధానాలపై కూడా అధికారులతో చర్చించనున్నారు. ఎక్కడికక్కడ జిల్లాల వారీగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకోనున్న ముఖ్యమంత్రి, జిల్లా స్థాయిలో అమలు కావాల్సిన అన్ని కార్యక్రమాల అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అదే సమయంలో జిల్లాల్లోని శాంతిభద్రతల పరిస్థితిని కూడా సీఎం సమీక్షించనున్నారు. ఏడు నెలల పాలనపై ఏమంటారు? గత ఏడాది డిసెంబర్‌ 7వ తేదీన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పాలనా పరంగా సాధారణ కార్యక్రమాలు కొనసాగుతున్నప్పటికీ, సీఎం ఎక్కువగా రాజకీయ అంశాలపైనే దృష్టి సారించాల్సి వచ్చింది. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికలు, ఆ తర్వాత టీపీసీసీ అధ్యక్షుడి నియామకం, కేబినెట్‌ విస్తరణ లాంటి అనివార్య రాజకీయ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. అదే సమయంలో పార్టీలో చేరికలపై కూడా దృష్టి పెట్టారు. ఇక వీలున్నంత మేరకు ప్రభుత్వ పాలనపై కూడా సమీక్షలు నిర్వహించారు. ఇటీవలే అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం ప్రజలతో మమేకం కావాలని వారికి సూచించారు. ఆఫీసుల్లో కూర్చుని పనిచేయడం కన్నా క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. కేబినెట్‌ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం లాంటివి తాత్కాలికంగా వాయిదా పడిన నేపథ్యంలో ప్రస్తుతానికి పాలన వ్యవహారాలపై రేవంత్‌ దృష్టి సారించారు. తాను సైతం క్షేత్రస్థాయికి వెళ్లాలని నిర్ణయించారు. తొలుత గత ఏడు నెలల పాలనపై అధికారుల నుంచి అభిప్రాయాలు సేకరించడంతో పాటు కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై ప్రజల మనోగతం ఎలా ఉందన్న దానిపై కూడా జిల్లాల పర్యటనల సందర్భంగా ఆయన ఫీడ్‌బ్యాక్‌ తీసుకోనున్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ, రైతు భరోసా లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల అమలుపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని భావిస్తున్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున క్షేత్రస్థాయిలో ప్రజల మూడ్‌ ఎలా ఉందన్న దానిపై కూడా ఆయన ఫోకస్‌ పెట్టారని, అందులో భాగంగానే జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. నేడు మంగళగిరికి రేవంత్‌ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు గాను ముఖ్యమంత్రి సోమవారం ఏపీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3:15 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మంగళగిరికి వెళ్లి సీకే కన్వెన్షన్‌లో జరిగే వైఎస్సార్‌ జయంతి వేడుకల్లో పాల్గొంటారని, కార్యక్రమం ముగిసిన తర్వాత గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి రాత్రి 7:45 నిమిషాలకు హైదరాబాద్‌ వస్తారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి.

Jagannath Rath Yatra 2024:Man Died, Several Injured Due To Stampede-like Situation During Rath Yatra
Jagannath Rath Yatra 2024: పూరీలో వైభవంగా రథయాత్ర

భువనేశ్వర్‌: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరీలోని జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా మొదలైంది. సాయంత్రం లక్షలాది భక్తుల నినాదాల నడుమ జగన్నాథ ఆలయం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలోని గుండీచా ఆలయం దిశగా భారీ రథాలు ముందుకు సాగాయి. 5.20 గంటలకు రథాలు కదిలాయి. అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మూడు రథాలకు పూజలు చేశారు. ఆమె, ఒడిశా గవర్నర్‌ రఘుబర్‌ దాస్, సీఎం మోహన్‌ చరణ్‌ మాఝి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జగన్నాథ రథం తాళ్లను లాగి యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. ముందున్న బలభద్రుని ప్రతిష్టించిన 45 అడుగుల ఎత్తైన రథాన్ని దేవీ సుభద్ర, జగన్నాథుని రథాలు అనుసరించాయి. రథయాత్రకు ముందు భక్తుల బృందాలు జగన్నాథుని కీర్తనలను ఆలపిస్తూ ముందుకు సాగారు. రెండు రోజులపాటు సాగే యాత్ర కోసం భారీగా బందోబస్తు చేపట్టారు.సాయంత్రం వేళ బలభద్రుని రథం లాగుతున్న చోట ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దీంతో ఊపిరాడక తొమ్మిది మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తీసుకొచ్చేలోగా ఒడిశాలోని బాలాంగిర్‌ జిల్లాకు చెందిన లలిత్‌ బాగార్తి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. భక్తుని మృతి పట్ల సీఎం చరన్‌ మాఝీ సంతాపం వ్యక్తంచేశారు. అయితే 300 మందిదాకా గాయపడినట్లు మీడియాలో వార్తలొచ్చాయి.

Growing Rift Between Prince Harry And Meghan Markle
ప్రిన్స్‌ హ్యారీ, భార్య మేఘన్‌ల మధ్య విభేదాలు తలెత్తాయా?

బ్రిటన్‌ రాజు చార్లెస్‌ III చిన్న ​కుమారుడు ప్రిన్స్‌ హ్యారీ, అతడి భార్య మేఘన్‌ మర్క్లేల మధ్య విభేదాలు తలెత్తాయా? అందుకే వారిద్దరి మధ్య దూరం ఏర్పడిందా? అంటే అవుననే అంటున్నాయి అంతర్జాతీయ మీడియా సంస్థలు.అందుకు ఊతం ఇచ్చేలా మేఘన్‌ తన జీవితం ‘తాను అనుకున్నట్లుగా లేదని’, కాబట్టే ఆమె ఆందోళన చెందుతోందని నివేదికలు వెలుగులోకి వచ్చాయి.ప్రముఖ ఆథర్‌ టామ్ క్విన్ ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ.. ప్రిన్స్‌ హ్యారీ, అతడి భార్య మేఘన్‌ మార్క్లేల మధ్య దూరం పెరిగిపోతుంది. మేఘన్‌ తాను కోరుకున్నట్లు తన జీవితం లేదని బాధపడుతోంది. ఎందుకంటే తనకు మీడియా అటెన్షన్‌ అంటే బాగా ఇష్టం. అయితే ఇటీవల కాలంలో పలు సర్వేలు హ్యారీని,మేఘన్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదనే రిపోర్ట్‌లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. దీనికి తోడు 2020లో హ్యారీ దంపతులు రాజకుంటుంబ సభ్యలు హోదాను వదులుకుని అమెరికాలో కాలిఫోర్నియాలో సెటిల్‌ అయ్యారు. అయినప్పటికీ మొదట్లో కాలిఫోర్నియాలో హ్యారీ దంపతులకు అపూర్వ ఆదరణ లభించిందని, సినీరంగానికి చెందిన (హాలీవుడ్‌) ప్రముఖులు వారితో స్నేహం కోసం క్యూకట్టినట్లు పలు మీడియా రిపోర్ట్‌లు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ, వారి ప్రజాదరణ తగ్గుముఖం పట్టిందని సర్వేలు హైలెట్‌ చేశాయి. మేఘనా మార్క్లే ‘అమెరికాలో రివేరా ఆర్చర్డ్’ అనే ఆహార ఉత్పత్తుల బ్రాండ్‌ను లాంచ్‌ చేశారు. ఆ సమయంలో ఆమె కన్నీటి పర్యంతరమయ్యారు. ఎందుకంటే ఆమె రివే ఆర్చర్డ్స్‌ ఆహార ఉత్పత్తులు చాలా ఖరీదైనవి. కానీ వాటిల్లో అంత నాణ్యత లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆ విమర్శల్ని తాను తట్టుకోలేకపోయారు. అమెరికాలో మేఘన్‌ విలాసవంతమైన జీవనశైలిపై ఎప్పుడూ విమర్శలు వస్తుంటాయి. ఈ అంశం ఆమెకు అస్సలు మింగుడు పడడం లేదు. ఈ వరుస పరిణామాలు తాను అనుకున్నట్లు తన జీవితం లేదని మేఘన బాధపడుతుందని ఆథర్‌ టామ్ క్విన్ చెప్పారు. దీనికి తోడు ప్రిన్స్‌ హ్యారీని మేఘన్‌ను విసిగిస్తుందనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హ్యారీకి యూకేలోని తన స్నేహితులు అంటే చాలా ఇష్టం. వారిని కలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండేవారు. కానీ హ్యారీ వారిని కలుసుకోవడం మేఘన్‌కు అస్సలు ఇష్టం ఉండదు. బహుశా ఈ తరహా వ్యక్తిగత భేదాభిప్రాయాల కారణంగా ప్రిన్స్‌ హ్యారీ అతడి భార్య మేఘన్‌ మర్క్లేల మధ్య దూరం పెరిగిపోతుందని పరోక్షంగా అభిప్రాయం వ్యక్తం చేశారు.

Frequent Lightening Endangering Lifes In Bihar
బిహార్‌లో ప్రాణాలు తీస్తున్న పిడుగులు

పాట్నా: బిహార్‌ ప్రజలను పిడుగులు బెంబేలెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో పిడుగుపాటు వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత రెండు వారాల్లో పిడుగులు పడి దాదాపు 40 మంది మృతి చెందారు. తాజాగా గడిచిన 24 గంటల్లో మరో 10 మంది పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.పిడుగుపాటుకు గురైన ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు సీఎం నితీశ్‌కుమార్‌ తెలిపారు. పిడుగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు.

Ind vs Zim 2nd T20: Bishnoi Sundar Shine India Beat Zimbabwe By 100 Runs
దెబ్బ‌కు దెబ్బ‌.. టీమిండియా చేతిలో జింబాబ్వే చిత్తు

జింబాబ్వేతో రెండో టీ20లో యువ టీమిండియా అద‌ర‌గొట్టింది. ఆతిథ్య జ‌ట్టును వంద‌ ప‌రుగుల తేడాతో మ‌ట్టిక‌రిపించి ఘ‌న విజ‌యం సాధించింది. తొలి టీ20లో ఎదురైన ప‌రాభ‌వానికి ప్ర‌తీకారం తీర్చుకుంది.దెబ్బ‌కు దెబ్బ కొట్టి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో స‌మం చేసింది. ఇక ఈ గెలుపు ద్వారా టీమిండియా స్టార్ బ్యాట‌ర్ శుబ్‌మ‌న్ గిల్ ఖాతాలో కెప్టెన్‌గా తొలి విజ‌యం న‌మోదైంది.దుమ్ములేపిన అభిషేక్‌.. రాణించిన రుతురాజ్‌హ‌రారే వేదిక‌గా ఆదివారం జ‌రిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెన‌ర్ శుబ్‌మ‌న్ గిల్ 2 ప‌రుగులు మాత్ర‌మే చేసి నిరాశ ప‌రిచాడు. అయితే మ‌రో ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగి జింబాబ్వే బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు.తొలి టీ20లో విఫ‌ల‌మైన ఈ పంజాబీ బ్యాట‌ర్ తాజా మ్యాచ్‌లో సెంచ‌రీ చేసి త‌న విలువ చాటుకున్నాడు. మొత్తంగా 47 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 8 సిక్స‌ర్ల సాయంతో స‌రిగ్గా 100 ప‌రుగులు చేసి పెవిలియ‌న్ చేరాడు.అభిషేక్ శ‌ర్మ‌కు తోడుగా వ‌న్‌డౌన్ బ్యాట‌ర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అర్థ‌శ‌త‌కం (47 బంతుల్లో 77 ప‌రుగులు) తో అజేయంగా నిలిచాడు. నాలుగో స్థానంలో బ‌రిలోకి దిగిన రింకూ సింగ్ (22 బంతుల్లో 48 ప‌రుగులు నాటౌట్‌, ఫోర్లు 2, సిక్స‌ర్లు 5) రుతురాజ్‌తో క‌లిసి స్కోరు బోర్డును ప‌రుగెత్తించాడు.ఈ క్ర‌మంలో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో యువ భార‌త జ‌ట్టు కేవ‌లం రెండు వికెట్లు న‌ష్ట‌పోయి ఏకంగా 234 ప‌రుగులు సాధించింది. ఇక ల‌క్ష్య ఛేద‌న‌కు దిగిన జింబాబ్వేకు భార‌త బౌల‌ర్లు చుక్క‌లు చూపించారు.జోరుగా హుషారుగా వికెట్లు...ఓపెన‌ర్ ఇన్నోసెంట్ క‌యా (4)ను ముకేష్‌కుమార్ ఆదిలోనే వెన‌క్కి పంపించాడు. అయితే, రెండో వికెట్ తీయ‌డానికి భార‌త బౌల‌ర్లు కాస్త శ్ర‌మించాల్సి వ‌చ్చింది. మ‌రో ఓపెన‌ర్ వెస్లే మెదెవెరె(43), వ‌న్‌డౌన్ బ్యాట‌ర్ బ్రియాన్ బ్యానెట్ (26) తేలిక‌గా త‌లొగ్గ‌లేదు.బ్యానెట్‌ను ముకేష్‌కుమార్ ఔట్ చేయ‌గా.. రవి బిష్ణోయ్ వెస్లే ప‌ని ప‌ట్టాడు. ఇదే జోరును భార‌త బౌల‌ర్లు కొన‌సాగించ‌డంతో జింబాబ్వే మిడిల్ ఆర్డ‌ర్ చేతులెత్తేసింది. ఈక్ర‌మంలో లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో వ‌చ్చిన ల్యూక్ జాంగ్వే 33 ప‌రుగులు చేసి కాసేపు పోరాడాడు. ముకేష్ దెబ్బ‌కు అత‌డుకూడా పెవిలియ‌న్ చేర‌క త‌ప్ప‌లేదు.ఈక్ర‌మంలో 18.4 ఓవ‌ర్ల‌లోనే జింబాబ్వే క‌థ ముగిసింది. కేవ‌లం 134 ప‌రుగులు మాత్ర‌మే చేసి 100 ప‌రుగుల భారీ తేడాతో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది.టీమిండియా బౌల‌ర్లలో ముకేష్‌కుమార్‌, ఆవేశ్‌ఖాన్ చెరో మూడు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. ర‌వి బిష్ణోయ్ రెండు, వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఒక వికెట్ తీశారు. భార‌త్ బ్యాట‌ర్ అభిషేక్ శ‌ర్మ‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ద‌క్కింది. ఇరు జ‌ట్ల మ‌ధ్య బుధ‌వారం మూడో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

Bmw Car Hit And Run Case In Mumbai Update
మద్యం మత్తులో బీభత్సం.. కేసు నుంచి అధికార పార్టీ నేత కుమారుణ్ని తప్పిస్తున్నారా?

ముంబై అధికార శివసేన పార్టీ నేత రాజేష్‌ షా కుమారుడు మిహిర్‌ షా (24) హిట్‌ అండ్‌ రన్‌ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం ఉదయం మిషిర్‌ షా బీఎండబ్ల్యూ స్పోర్ట్స్‌ కారు ఢీకొట్టడంతో ఓ మహిళ ప్రాణం కోల్పోయింది. అయితే ఈ కేసులో మిషిర్‌ షాను తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో మిహిర్‌ షా ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ స్పోర్ట్స్‌ కారు ముంబై వర్లిలోని సాసూన్ డాక్ ఫిష్‌ మార్కెట్‌కి వెళ్లి తిరిగి వస్తున్న భార్య కావేరీ నక్వా,ఆమె భర్త పార్థిక్‌‌ నక్వా ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బాధితురాలు కావేరీ నక్వా మరణించగా.. భర్త పార్థిక్‌ నక్వా గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతుడున్నాడు.అయితే ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగే సమయంలో కారులో కారు డ్రైవర్‌ రాజేంద్ర సింగ్‌ బిజావత్‌తో పాటు మిహిర్‌ షా ఉన్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే పరారైన మిహిర్‌ షా కోసం పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. డ్రైవర్‌ను బిజావత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అధికార పార్టీ నేత కుమారుడికి అనుకూలంగాహిట్‌ అండ్‌ రన్‌ కేసులో పోలీసులు నమోదు చేసిన సెక్షన్లపై వివాదం నెలకొంది. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద అంటే హత్యతో సమానం కాని నేరాల కింద పోలీసులు కేసు నమోదు చేయడం పలు అనుమానాలకు తావిస్తుంది. హిట్‌ అండ్‌ రన్‌ కేసులో సాధారణంగా నేరపూరిత నరహత్య, ర్యాష్ డ్రైవింగ్,సాక్ష్యాలను ధ్వంసం చేయడం మొదలైన వాటిపై కేసు నమోదు చేస్తారని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మద్యం సేవించిన కారు డ్రైవర్‌ బిజావత్ నుంచి రక్త నమోనాలకు సేకరించారు.రిపోర్ట్స్‌ రావాల్సి ఉంది.వాళ్లు సమాజంలో పేరున్న పెద్దోళ్లు.. మనమేం చేయలేంరోడ్డు ప్రమాదంపై తన భార్య కావేరీ నక్వా మరణంపై ఆమె భర్త పార్థిక్‌‌ నక్వా కన్నీరు మున్నీరవుతున్నారు. ‘‘ఫిష్‌ మార్కెట్‌ నుంచి తిరిగి వస్తున్న తమ వెహికల్‌ను బీఎండబ్ల్యూ కారు ఢీకొట్టింది. నా భార్య ఎగిరి 100 మీటర్ల అవతల పడింది. నాకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో నా భార్యను కోల్పోయా. నాకు ఇద్దరు పిల్లలు. వారి సంరక్షణ ఎవరు చూసుకోవాలి. వాళ్లంటే సమాజంలో పేరున్న పెద్ద మనుషులు. వారిని ఎవరు ఏం చేయలేరు. చివరికి బాధపడాల్సి మనమే అంటూ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో ప్రధాన కారకుడైన మిహిర్‌ షా‘‘ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.పోలీసులు వెర్షన్‌ ఎలా ఉందంటే? బీఎండబ్ల్యూ కారు మిహిర్ షా పేరు మీద రిజిస్టర్ అయినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో మిహిర్ షా, డ్రైవర్ ఇద్దరు కారులో ఉన్నారు. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. మిహిర్ షా గత రాత్రి జుహులోని ఓ బార్‌లో మద్యం సేవించాడు. ఇంటికి వెళుతుండగా, డ్రైవర్‌ని లాంగ్ డ్రైవ్ చేయమని అడిగాడు. వర్లీ ప్రాంతంలో కారు డ్రైవ్‌ చేస్తున్న మిహిర్‌ షా.. కావేరీ నక్వా ప్రయాణిస్తున్న స్కూటీని ఢీ కొట్టాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సీఎం ఏక్‌ నాథ్‌ షిండ్‌ ఏమన్నారంటే?మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండ్‌ హిట్‌ అండ్‌ రన్‌ కేసుపై స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొంటూ నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిందితులు ఎంతటివారైనా చట్టం తన పని తాను చేస్తుందని పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానమే దేశంలో చట్టం ముందు అందరూ సమానమేనని, ఆ విషయంలో ఎవరి పట్ల వివక్ష చూపబోమని, ఈ కేసులో బాధితులకు న్యాయం జరిగేలా.. నిందితులకు శిక్షపడేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఏక్‌ నాథ్‌ షిండ్‌ వెల్లడించారు.

Managing the regional ring road works central govt and state govt
‘రింగు’ చెరిసగం!

సాక్షి, హైదరాబాద్‌: రీజినల్‌ రింగురోడ్డు పనుల నిర్వహణ బాధ్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం చూసుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుతం టెండర్ల దశకు చేరువలో ఉన్న ఉత్తరభాగాన్ని కేంద్రప్రభుత్వం నిర్వహించనుంది. ఇక అలై న్‌మెంట్‌ దశలోనే ఆగిపోయిన దక్షిణభాగాన్ని రాష్ట్ర ప్రభు త్వం ఆధ్వర్యంలో నిర్వహించాలన్న అంశాన్ని కేంద్రం పరిశీ లిస్తోంది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీతో నిర్వహించిన భేటీలో చర్చకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వమే ఈ మేరకు ప్రతిపాదించినట్టు సమాచారం. దీనిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. భారత్‌మాల పరియోజనలో చోటు దక్కకపోవటంతో..రీజినల్‌రింగ్‌ రోడ్డులో 162.4 కి.మీ నిడివి ఉండే ఉత్తరభాగాన్ని, 189.2 కి.మీ. నిడివి ఉండే దక్షిణభాగాన్ని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్‌హెచ్‌ఏఐ పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. ఉత్తర భాగం భూపరిహారం పంపిణీకి సంబంధించిన అవార్డులు పాస్‌ చేసే దశలో ఉంది. మరో రెండుమూడు నెలల్లో టెండర్ల ప్రక్రియ జరగనుంది. కానీ, దక్షిణభాగానికి ఏడాది క్రితం అలైన్‌మెంట్‌ పూర్తయినా, ఇప్పటికీ కేంద్రం నుంచి ఆమోదం లభించలేదు. ఆ భాగానికి సంబంధించి ఎలాంటి కసరత్తు జరగటం లేదు. నిజానికి ఈ రెండు భాగాలను భారత్‌మాల పరియోజన కార్యక్రమంలో చేర్చాల్సి ఉంది. ఉత్తర భాగాన్ని గతంలోనే ఆ జాబితాలో చేర్చారు. కానీ, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య సమన్వయం లోపించటం, భూసేకరణ పరిహారంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించే విషయంలో అగాధం ఏర్పడటంతో రోడ్డు ప్రక్రియలో జాప్యం జరిగింది. భారత్‌మాల పరియోజనపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవటంతో రీజినల్‌ రింగురోడ్డును దాని నుంచి మినహాయించారు. దీంతో మిగిలిపోయిన 7500 కి.మీ. నిడివి గల ఎక్స్‌ప్రెస్‌వే పనులతోపాటు మరో 5000 కి.మీ. ఎక్స్‌ప్రెస్‌ వే ప్రాజెక్టులను చేరుస్తూ 2047 సంవత్సరం లక్ష్యంతో కొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది.భారత్‌మాల పరియోజనలో చోటు దక్కిన వాటిని ముందు నిర్వహించి, రెండో ప్రోగ్రామ్‌లో ఉన్న వాటిని తర్వాత నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి తగ్గట్టుగానే నిధుల కేటాయింపు ఉంటుంది. రింగు ఉత్తరభాగాన్ని తొలుత భారత్‌మాలలో చేర్చినందున, దానిని అలాగే కొనసాగిస్తూ దక్షిణభాగాన్ని రెండో ప్రోగ్రామ్‌లో చేర్చారు. ఫలితంగా దక్షిణ భాగం పనులు ఇప్పట్లో ప్రారంభమయ్యే సూచనలే లేవు. దీనిని ఇటీవల ముఖ్యమంత్రి కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. దక్షిణ భాగాన్ని మరో రకంగానైనా చేపట్టాలని కోరారు. దీనిపై అధికారులతో చర్చించిన మీదట, పీడబ్ల్యూడీ ద్వారా నిర్వహించే అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న జాతీయ రహదారుల విభాగం(ఎన్‌హెచ్‌)ను పీడబ్ల్యూడీకి స్థానిక ప్రత్యామ్నాయంగా వ్యవహరిస్తున్నది. ఈ విభాగం ద్వారా నిర్వహించే రోడ్డు పనులకు కేంద్రమే నిధులు సమకూరుస్తున్నా, పనుల నిర్వహణ మాత్రం పూర్తిగా రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతాయి. భారత్‌మాల పరియోజన కింద కేంద్రప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండే ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో ఉత్తరభాగం, రాష్ట్రప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండే ఎన్‌హెచ్‌ విభాగం ఆధ్వర్యంలో దక్షిణభాగం పనుల నిర్వహణ ఉంటుందన్నమాట. దీనిపై కేంద్రప్రభుత్వం స్పష్టత ఇచ్చాక తదుపరి కార్యాచరణ ఉంటుంది. అదే జరిగితే ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో ఉత్తరభాగం పనులు ప్రారంభమైన వెంటనే ఎన్‌హెచ్‌ ఆధ్వర్యంలో దక్షిణభాగం పనులు పట్టాలెక్కుతాయి. ఆ విభాగానికి పెద్ద టాస్కే..రింగురోడ్డు దక్షిణ విభాగం పనుల అంచనా దాదాపు రూ.19 వేల కోట్లు ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్‌హెచ్‌ విభాగం ఇంత పెద్ద పనులు చేపట్టలేదు. దాదాపు 2500 హెక్టార్ల భూసేకరణ చేపట్టాల్సి ఉంది. తక్కువ నిడివి ఉండే జాతీయ రహదారులను ఆ విభాగం చేపడుతూ వచ్చింది. ఇప్పుడు రీజినల్‌ రింగురోడ్డు బాధ్యత వస్తే ప్రత్యేకంగా అంతర్గతంగా కొన్ని విభాగాలనే ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకు సిబ్బందిని కూడా సమకూర్చుకోవాల్సి ఉంటుంది.

If You Are Preparing For Neet Again Heres Why You Should Choose Aakashs Repeaterxii Passed Courses
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?

NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement
Advertisement
Advertisement
International View all
French elections 2024: ఫ్రాన్స్‌ రెండో దశలో... రికార్డు పోలింగ్‌

పారిస్‌: ఫ్రాన్స్‌ పార్లమెంటు ఎన్నికల్లో ఆదివారం కీలకమైన రెం

IPE Global: డేంజర్‌ మార్కు దాటేస్తున్న... భుగభుగలు

ఈ వేసవిలో ఉత్తర భారతమంతా కనీవిని ఎండలతో తల్లడిల్లిపోయింది.

ప్రిన్స్‌ హ్యారీ, భార్య మేఘన్‌ల మధ్య విభేదాలు తలెత్తాయా?

బ్రిటన్‌ రాజు చార్లెస్‌ III చిన్న ​కుమారుడు ప్రిన్స్‌ హ్యారీ, అతడి భార్య మేఘన్‌ మర్క్లేల మధ్య విభేదాలు తలెత్తాయా?

భారత సరిహద్దుల్లో చైనా బంకర్ల నిర్మాణం!

భారత్‌ను కవ్వించే ప్రయత్నాలు చేస్తోంది చైనా.

India-UK Free Trade Agreement: స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సిద్ధం

లండన్‌: భారత్‌– బ్రిటన్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని

National View all
IPE Global: డేంజర్‌ మార్కు దాటేస్తున్న... భుగభుగలు

ఈ వేసవిలో ఉత్తర భారతమంతా కనీవిని ఎండలతో తల్లడిల్లిపోయింది.

Jagannath Rath Yatra 2024: పూరీలో వైభవంగా రథయాత్ర

భువనేశ్వర్‌: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరీలోని జగన్నాథుని రథయా

బిహార్‌లో ప్రాణాలు తీస్తున్న పిడుగులు

పాట్నా: బిహార్‌ ప్రజలను పిడుగులు బెంబేలెత్తిస్తున్నాయి.

ఒడిశా జగన్నాథుడి రథయాత్రలో అపశృతి

ఒడిశా జగన్నాథుడి రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. రథం లాగుతుండగా ఒక్కోసారిగా తొక్కిసలాట జరిగి ఒకరు మృతి చెందినట్లు సమాచారం. 

మద్యం మత్తులో బీభత్సం.. కేసు నుంచి అధికార పార్టీ నేత కుమారుణ్ని తప్పిస్తున్నారా?

ముంబై అధికార శివసేన పార్టీ నేత రాజేష్‌ షా కుమారుడు మిహిర్‌ షా (24) హిట్‌ అండ్‌ రన్‌ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటు

Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all