హైదరాబాద్: వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి పాత్ర లేకపోయినా అనూహ్యంగా సీబీఐ టార్గెట్ చేసిందని తెలంగాణ హైకోర్టులో అవినాష్‌రెడ్డి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఈరోజు(మంగళవారం) అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో విచారణ సందర్భంగా వాదనలు జరుగుతున్నాయి.
దీనిలో భాగంగా అవినాష్ తరఫు న్యాయవాది తన వాదనను వినిపిస్తూ.. ‘అప్రూవర్‌గా మారిన దస్తగిరి కడపలో కూర్చొని ట్రయల్స్ చేస్తున్నాడు. ఇక్కడ కోర్టులో చేసిన వాదనలకు అక్కడ కౌంటర్ కామెంట్స్ చేస్తున్నాడు. అవినాష్‌పై, ప్రభుత్వంపై దస్తగిరి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. సీబీఐ ఎస్పీ రామ్ సింగ్‌ని పలుకుబడితో..ట్రాన్స్‌ఫర్ చేశాడని ఆరోపణలు చేశాడు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు అధికారిని మార్చారు. తప్పుడు ఆరోపణలు చేసిన దస్తగిరిని సునీత న్యాయవాది సమర్ధిస్తున్నాడు. సీబీఐ ఆఫీసర్ రామ్ సింగ్‌ను మార్చింది సుప్రీం కోర్టు.. అవినాష్ రెడ్డి అని ఎలా అంటారు..?, నేరం చేశారు అనడానికి సీబీఐ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. కుటుంబ గొడవలు, భూ వివాదాలు, వివాహేతర సంబంధాలు వివేకా హత్యకు కారణమై ఉండొచ్చు. సీబీఐ ఇప్పటి వరకు 2 చార్జీ షీట్‌లు వేసింది. మొదటి చార్జిషీట్‌కు ముందే దస్తగిరి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. అనూహ్యంగా అవినాష్‌ను సీబీఐ టార్గెట్ చేసింది. ఎక్కడా అవినాష్ రెడ్డి పాత్ర లేదు’ అని తెలిపారు.
సమాచారం ఇచ్చిన వ్యక్తిని ఎందుకు విచారించలేదు?
వివేకా చనిపోయిన రోజు ఉదయం గం. 6.26ని.లకు అవినాష్‌కు వివేకా చనిపోయినట్లు చెప్పింది శివప్రకాష్‌రెడ్డి. వాళ్లు ఫోన్ చేసే వరకూ అవినాష్‌కి వివేకా మరణం గురించి తెలియదు. అవినాష్ రెడ్డికి సమాచారం ఇచ్చిన వారిని సీబీఐ ఎందుకు విచారించడం లేదు. ఆరోజు పలువురు వ్యక్తులు వివేకా ఇంట్లోనే ఉన్నారు. గుండెపోటు అని రూమర్స్ ప్రచారం జరిగింది. ఆ రూమర్స్ ప్రకారమే గుండెపోటు అని అవినాష్‌రెడ్డి చెప్పారు’ అని అవినాష్‌రెడ్డి తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి హైకోర్టుకు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment