
గేదెల్లో ముర్రాజాతికి చాలా ప్రత్యేకత ఉంది. ఆ జాతి దున్నలకు కూడా డిమాండ్ చాలా ఉంది. వైఎస్సార్ జిల్లా వేముల మండలంలోని కొండ్రెడ్డిపల్లె గ్రామానికి చెందిన రైతు శిరిగిరెడ్డి అంకిరెడ్డి వద్ద ఉన్న ముర్రాజాతి దున్నపోతును కొనుగోలు చేసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు.
వేముల: గేదెల్లో ముర్రాజాతికి చాలా ప్రత్యేకత ఉంది. ఆ జాతి దున్నలకు కూడా డిమాండ్ చాలా ఉంది. వైఎస్సార్ జిల్లా వేముల మండలంలోని కొండ్రెడ్డిపల్లె గ్రామానికి చెందిన రైతు శిరిగిరెడ్డి అంకిరెడ్డి వద్ద ఉన్న ముర్రాజాతి దున్నపోతును కొనుగోలు చేసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. రూ. 15 లక్షలకు అమ్ముతానని ఆయన చెబుతున్నారు. ముర్రా జాతి దున్నలను కొనేందుకు డెయిరీలు నిర్వహించే వారు ఆసక్తి చూపుతారని, అందుకే ఆ దున్నకు అంత ధర పలుకుతోందని స్థానిక పశువైద్యాధికారి శ్రీవాణి తెలిపారు.
చదవండి: వందశాతం విద్యుదీకరణ భేష్: ఏపీకి నీతి ఆయోగ్ ప్రశంస
విద్యారంగం.. పురోగమనం