
సాక్షి, నెల్లూరు : నగరంలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. గుర్తుతెలియని దుండగులు అచ్చుత్ అనే బాలుడిని కిడ్నాప్ చేశారు. అయితే వీరు స్థానికుల కంటపడటంతో ఓ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పారిపోయిన మరో నిందితుడు కోసం గాలింపు చేపడుతున్నారు. అయితే ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. బాలుడు కిడ్నాప్ కాకుండా స్థానికులు కాపాడటంతో అతని తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. తమకు దగ్గరివారే ఇలాంటి కుట్రకు పాల్పడి ఉంటారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.