
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ (ముందే బిల్లు చెల్లించే) విద్యుత్ మీటర్లు బిగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర అభయాన్ పథకంలో భాగంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల్లో వచ్చే ఏడాది మార్చి కల్లా ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుత మీటర్ల స్థానంలో ప్రీపెయిడ్ మీటర్లను డిస్కమ్‌లు ఏర్పాటు చేసి వాటి వ్యయాన్ని ప్రతినెలా రెండు శాతం చొప్పున విద్యుత్ బిల్లు నుంచి వసూలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు.