
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులు, ఇతర అవసరాలు తెలుసుకునేందుకు చేపట్టిన ఏపీ సమగ్ర పరిశ్రమ సర్వే–2020 వేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 16,948 యూనిట్ల నుంచి సమాచారాన్ని సేకరించారు. ఇప్పటికే 9,010 యూనిట్లకు సంబంధించి సర్వే పూర్తయింది. సర్వేలో కృష్ణా, అనంతపురం జిల్లాలు ముందంజలో ఉన్నాయి. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 1,254, అనంతలో 1,183 యూనిట్లలో సర్వే పూర్తయింది.
సర్వే సందర్భంగా ప్రతి పరిశ్రమకూ ఆధార్ నంబర్‌లా 11 అంకెలతో ఓ ప్రత్యేక అంకెను కేటాయించడంతో పాటు పరిశ్రమల అవసరాలకు సంబంధించిన తొమ్మిది రకాల కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. అక్టోబర్ 15 నాటికే సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. కరోనా, వరదల కారణంగా కొన్ని చోట్ల సర్వే ఆలస్యమవుతోంది. అవసరమైతే గడువు తేదీని పెంచే అవకాశముందని పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment