సాక్షి, అమరావతి: తుపాన్లు, భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు రెండు దశల్లో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని ఆర్ అండ్ బీ శాఖ నిర్ణయించింది. తిత్లీ, నివర్ తుపాన్లు, భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ రోడ్ల మరమ్మతులను వెంటనే చేపట్టాలని సీఎం జగన్ ఇటీవల అధికారులను ఆదేశించారు. ఈమేరకు అధికారులు రెండు దశల్లో రూ.540 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. అందులో రూ.154 కోట్లతో 260 పనులను ఇప్పటికే ఆమోదించారు.
త్వరలో మరో రూ.386 కోట్లతో పనులకు ప్రణాళికలను రూపొందించి ప్రభుత్వ ఆమోదానికి పంపింది. మొదటి దశలో రాష్ట్ర ప్రధాన రహదారుల మరమ్మతుల కోసం రూ.74 కోట్లతో 50 పనులను ఆమోదించారు. వాటిలో 25 పనులను ప్రారంభించగా మరో 25 పనులు టెండర్ల దశలో ఉన్నాయి. ఇక జిల్లా ప్రధాన రహదారుల మరమ్మతుల కోసం రూ.80 కోట్లతో 210 పనులను ఆమోదించారు. వాటిలో 55 పనులను ప్రారంభించగా 155 పనులు టెండర్ల దశలో ఉన్నాయి. ఇక రెండో దశ పనులకు తుది ఆమోదం రాగానే పనులు మొదలుపెడతారు.
చదవండి: సీఎం సహాయ నిధికి రూ.1.33 కోట్ల విరాళం
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోండి
Comments
Please login to add a commentAdd a comment