స్పీకర్‌ తమ్మినేనికి తప్పిన ప్రమాదం | Road Accident To Assembly Speaker Tammineni Sitaram Convey | Sakshi
Sakshi News home page

స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు తప్పిన ప్రమాదం

Published Sat, Nov 21 2020 2:02 PM | Last Updated on Sat, Nov 21 2020 3:25 PM

Road Accident To Assembly Speaker Tammineni Sitaram Convey - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది. శ్రీకాకుళం జిల్లా వంజంగి వద్ద కాన్వాయ్‌లోకి ఓ ఆటో వేగంగా దూసుకుని వచ్చింది.  ఆటో డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కారు డ్రైవర్‌ అప్రమత్తంగా ఉండటంతో తమ్మినేనికి ప్రమాదం తప్పింది. శనివారం మధ్నాహం శ్రీకాకుళం కలెక్టరేట్‌ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో క్షేమంగా తిరిగి వెళ్లారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement