
కులాల మధ్య చిచ్చుపెట్టే వ్యక్తిత్వం చంద్రబాబుదని, రాజకీయ బతుకుదెరువు కోసం టీడీపీ కుట్రలు చేస్తోందని సజ్జల మండిపడ్డారు.
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గిరిజన పక్షపాతి అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం ఆయన ఎస్టీ కమిషన్ తొలి ఛైర్మన్ కుంభా రవిబాబు పదవీ బాధ్యతల స్వీకార మహోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ, అణచివేతకు గురయ్యే వర్గాలను పటిష్టంగా మార్చడం సీఎం జగన్ ఉద్దేశమని పేర్కొన్నారు. గిరిజన సంస్కృతిపై అవగాహన ఉన్న వ్యక్తి కుంభా రవిబాబు అని, ఎస్టీ కమిషన్ తొలి ఛైర్మన్‌గా ఆయన నియమితులయ్యారని తెలిపారు.
సీఎం జగన్ వినూత్నమైన విధానాలు చేపట్టారని.. మహిళలకు మున్సిపల్ ఛైర్‌పర్సన్లుగా అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టే వ్యక్తిత్వం చంద్రబాబుదని, రాజకీయ బతుకుదెరువు కోసం టీడీపీ కుట్రలు చేస్తోందని సజ్జల మండిపడ్డారు. సీఎం జగన్ సంక్షేమ పాలనను చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు.
చదవండి:
ఎస్టీ కమిషన్ తొలి ఛైర్మన్‌గా కుంభా రవిబాబు బాధ్యతలు
నాడు అపహాస్యం.. నేడు జరుగుతుంది అదే..