సాక్షి, తాడేపల్లి: ఫేక్ వార్తల ప్రచారంలో ఈనాడు మరో అడుగు ముందుకేసి ఇష్టానుసారం పిచ్చి రాతలు రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనాడు తప్పుడు వార్తలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ సీరియస్ అయ్యారు. ఎల్లో మీడియా టెర్రరిస్టులు తయారు చేసే వార్తలు ఆర్డీఎక్స్ కంటే ప్రమాదం అంటూ కామెంట్స్ చేశారు.
కాగా, సజ్జల బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. వ్యక్తిత్వ హననం చేయడమే చంద్రబాబు, రామోజీల పని. అబద్దాలు ఎలా చెప్పాలో టీడీపీ నేత చెంగల్రాయుడు పార్టీ మీటింగ్‌లోనే చెప్పారు. శిక్షణా తరగతుల్లో చంద్రబాబు ముందే చెంగల్రాయుడు మాట్లాడారు. రౌడీలు, అబద్ధాలకోరులతో జన్మభూమి కమిటీ వేశారు. బూతులు నేర్పించి ఒక ఆంబోతులా పట్టాభిని ప్రజల మీదకు వదిలారు. బూతులు తిట్టడంలో పరీక్ష పెడితే పట్టాభికి డిస్టిక్షన్ వస్తుంది. బూతులు తిడుతూ అధికారులపై దాడులు చేస్తే కేసులు పెట్టొద్దా?. మీడియా ద్వారా దేశాన్ని శాసించాలని రామోజీ భావిస్తున్నాడు. సాక్షి వచ్చాకే రామోజీ ఆగడాలకు అడ్డుకట్ట పడింది. ఎన్టీఆర్‌ను గద్దెదించడంలో చంద్రబాబుకు రామోజీ సహకరించారు. వ్యవస్థలను మేనేజ్ చేయడమే చంద్రబాబు, రామోజీల పని.
చంద్రబాబు ఎప్పుడూ సొంతంగా అధికారంలోకి వచ్చింది లేదు. ఊతకర్రల పొత్తుల సాయంతోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. టీడీపీ నేతలు తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. కొందరైతే ఎందుకు తిడుతున్నారో కూడా తెలియదు. జనాల్ని పక్కదారి పట్టించడానికే ఈనాడు అబద్దపు రాతలు రాస్తోంది. రెండేళ్ల క్రితం ఫొటోలతో ఇప్పుడు జరిగిందని ఈనాడు తప్పుడు ప్రచారం చేసింది. ఈనాడు వికృత విన్యాసాలు చేసి సాంకేతిక సమస్య అని తప్పించుకుంటోంది. అబద్ధాలు ప్రచారం చేసే ఈనాడును ప్రజలు స్వచ్చందంగా బహిష్కరించాలి.
కందుకూరు ఘటనకు చంద్రబాబే బాధ్యుడు. కందుకూరు సందుల్లో నీవల్ల మనుషులు చనిపోకపోతే ప్రభుత్వం జోవో నంబర్-1 ఎందుకు తీసుకువచ్చేది. సమావేశాలు పెట్టుకునేందుకు స్థలం చూపెట్టినా రోడ్లపైనే చంద్రబాబు సభలు నిర్వహించాడు. 2014-19 మధ్య వ్యవస్థలను పూర్తిగా నాశనం చేసింది చంద్రబాబే. 2014లో ఎమ్మెల్యే ముస్తఫాను ఎత్తుకెళ్లి బెదిరించారు. చెరుకులపాటి నారాయణరెడ్డిని ఏవిధంగా హత్య చేయించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రోజాను ఏవిధంగా వేధించారో అందరికీ తెలుసు.
పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసిన చరిత్ర చరిత్ర చంద్రబాబుది. ఈనాడు క్రెడిబిలిటీ ఎప్పుడో పోయింది. ఉగ్రవాద మనస్తత్వానికి నిదర్శనం ఈనాడు, ఆంధ్రజ్యోతి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా నాయకుడు విశాఖ వెళ్తే ఎయిర్‌పోర్టు లోపలే అడ్డుకోలేదా?. నువ్వే మర్డర్ చేస్తావ్, నువ్వే న్యాయవాదివి, నువ్వే జడ్జివి. టీడీపీ శాశ్వతంగా భూస్థాపితం కావాలి. ప్రపంచాన్ని జయించిన చక్రవర్తితలా రామోజీ ఫీల్ అవుతున్నాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment