మదనపల్లె సిటీ(చిత్తూరు జిల్లా): ఒకప్పుడు సంక్రాంతి నెల ప్రారంభమైందంటే ప్రజలు పండుగకు ఏర్పాట్లను ప్రారంభించేవారు. ప్రధానంగా మదనపల్లె పరిసర ప్రాంతాల పల్లెలు వ్యవసాయమే జీవనాధారం. ఎటుచూసినా పశుసంపద ఉండేది. ఇందువల్ల ప్రతీది ప్రకృతి సహజసిద్ధంగా లభించేంది. ఇప్పుడంతా ఆధునిక యుగం. దీనికి తోడు ప్రతిఒక్కరిది ఉరకులు పరుగుల జీవనం. దీంతో సంక్రాంతి వంటి పెద్ద పండుగను రెడీమేడ్ వస్తువులతో జరుపుకోవాల్సి వస్తోంది.
కనిపించని గొబ్బెమ్మ పాటలు..
గొబ్బియాళ్లో, గొబ్బియళ్లో అంటూ ఇళ్ల ముందు గొబ్బిపాటలు పాడే వారు కనుమరుగయ్యారు. మదనపల్లె మండలం గొల్లపల్లిలో గొబ్బిపాటలు పాడే వారు ఉన్నారు. కాలక్రమేణా వీరు కూడా తగ్గిపోయారు. దీంతో నామమాత్రంగా ఇళ్ల వద్దకు వస్తున్నారు.
పేడకు బదులు రంగు పౌడర్..
ఒకప్పుడు ఇంటి ముంగిట పేడనీళ్లు చల్లి ముగ్గులు వేసేవారు. ప్రస్తుతం పశు సంపద తక్కువ అయినందున మదనపల్లె పట్టణంలో రంగు పౌడర్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఒక రోజుకు సరిపోయే ప్యాకెట్ కేవలం రూ.5 మాత్రమేకావడంతో అనేక మంది పేడ నీళ్ల కలర్ పౌడర్‌తో తమ ఇంటి లోగిళ్లను అలంకరించుకుంటున్నారు. అలాగే ముగ్గుకు బదులు ముగ్గుపిండి, ఇసుకలో కలిపిన రంగులు సైతం రెడీమేడ్‌గా మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి.
ముత్యాల ముగ్గులు..
సంక్రాంతిని తెలుగువారు పెద్ద పండువగా భావిస్తారు. ముగ్గులు లేని సంక్రాంతిని ఊహించలేం. ముగ్గులన్నా, ముగ్గులు వేయడమన్నా ఇష్టపడని మహిళలుండరు. తీరిక వేళల్లో తమ సృజన, నైపుణ్యాలను ప్రదర్శిస్తూ రంగురంగుల ముగ్గులను తళుకుమనిస్తుంటారు. సంక్రాంతి ముందుగానే మదనపల్లె పట్టణంలో పలు సంస్థలు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment