
ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు ఐదోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా, టీడీపీ సభ్యులు సభను అడ్డుకుంటూ గందరగోళం సృష్టించారు.
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు ఐదోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా, టీడీపీ సభ్యులు సభను అడ్డుకుంటూ గందరగోళం సృష్టించారు. స్పీకర్ చైర్ వైపు టీడీపీ ఎమ్మెల్యేలు దూసుకెళ్లారు. టీడీపీ సభ్యుల గందరగోళంతో సభను స్పీకర్ తమ్మినేని కాసేపు వాయిదా వేశారు. టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అభ్యంతరం తెలిపారు. సభను అడ్డుకోవడమే ప్రతిపక్షం పనిగా పెట్టుకుందని ఆయన మండిపడ్డారు. సభను సాగనీయకుండా ప్రతిరోజూ అడ్డుపడుతున్నారన్నారు. ప్రతి అంశాన్ని చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు.