
సాక్షి, కర్నూలు : నిన్న మొన్నటి వరకు 50-20 రూపాయల మధ్యలో చక్కర్లు కొట్టిన టమోట ధర ప్రసుతం దారుణంగా పడిపోయింది. పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌లో కిలో టమోట ధర రూపాయి నుంచి రెండు రూపాయలు పలుకుతోంది. దీంతో రైతులు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రంగంలోకి దిగింది. టమోటకు మద్దతు ధర కల్పించటానికి ముందుకొచ్చింది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో టమోట కొనుగోలు చేపట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment