టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌ | top10 telugu latest news evening headlines 25th November 2022 | Sakshi
Sakshi News home page

టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

Published Fri, Nov 25 2022 4:22 PM | Last Updated on Fri, Nov 25 2022 4:48 PM

top10 telugu latest news evening headlines 25th November 2022 - Sakshi

1. రాజమండ్రిలో వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌ నిర్మాణానికి సీఎం జగన్‌ గ్రీన్‌సిగ్నల్‌
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. నగరాలు, పట్టణాల్లో కనీస మౌలిక సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ, సమస్యలపై సత్వర పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ‘మార్గదర్శి’ మోసాలు.. మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు
టీడీపీ నేతలు పనికిమాలిన ప్రచారాలు చేస్తున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. ఓటముల ఎఫెక్ట్‌.. తెలంగాణలో ముగ్గురు కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్లపై వేటు!
తెలంగాణలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో ఏకంగా డిపాజిట్‌ సైతం కోల్పోయింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్టును ఆశ్రయించిన నిందితులు
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన కేసులో ఇవాళ(శుక్రవారం) మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. శివాజీ వ్యాఖ్యల దుమారం: గవర్నర్‌కు ఫడ్నవిస్‌ భార్య మద్దతు.. మరింత రచ్చ
మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీపై వ్యాఖ్యలతో వివాదంలోకి దిగారు మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారీ. ఛత్రపతి శివాజీ పాత ఐకాన్‌ అంటూ బహిరంగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు మహా సర్కార్‌ను సైతం ఇరకాటంలో పడేశాయి. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. భారత్ జోడో యాత్రలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలా? బీజేపీ వీడియోపై కాంగ్రెస్ ఆగ్రహం..
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్‌లో చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాకిస్తాన్ జిందాబాద్‌ నినాదాలు విన్పించాయని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ట్విటర్‌ బ్లూటిక్‌ ఒక్కటే కాదు! ఎవరెవరికి ఏ కలర్‌ అంటే?
ట్విటర్‌ కొత్త బాస్‌, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ ఫీజును రీలాంచ్‌ చేయనున్నారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. మరీ ఇంత దారుణమా.. టీమిండియా బౌలర్లపై దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్‌
టీమిండియా చేతిలో 0-1 తేడాతో టీ20 సిరీస్‌ను కోల్పోయిన న్యూజిలాండ్‌ జట్టు వన్డే సిరీస్‌లో ఘనంగా బోణీ కొట్టింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. న్యూజిలాండ్‌లో ఆర్‌సీ15 షూటింగ్.. పిక్స్ వైరల్..!
రామ్‌చ‌ర‌ణ్‌, శంక‌ర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'ఆర్‌సీ15'. ప్రస్తుతం ఈ సినిమాను న్యూజిలాండ్‌లో చిత్రీకరిస్తున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఢిల్లీ పోలీసులకు చిక్కిన ఆస్ట్రేలియాలో మోస్ట్ వాంటెడ్!
ఆస్ట్రేలియాలో మోస్ట్‌ వాంటెడ్‌ నిందితుడిని ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియా బీచ్‌లో జరిగిన ఓ యువతి హత్య కేసులో నిందితుడుగా ఉన్న రాజ్వేందర్‌ సింగ్‌ను(38)..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement