Top10 Telugu Latest News: Morning Headlines 15h September 2022 - Sakshi
Sakshi News home page

Top Trending News: టుడే మార్నింగ్‌ టాప్‌ 10 న్యూస్‌

Sep 15 2022 10:32 AM | Updated on Sep 15 2022 11:24 AM

Top10 Telugu Latest News Morning Headlines 15h September 2022 - Sakshi

1. ఏపీ అసెంబ్లీ సమావేశాలు: టీడీపీపై బుగ్గన ఆగ్రహం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలైన నిమిషాల వ్యవధిలోనే.. ప్రతిపక్ష టీడీపీ సభను అడ్డుకోవడానికి యత్నించడంపై మంత్రి  బుగ్గన స్పందించారు. టీడీపీ సభ్యుల తీరు సరిగా లేదన్నారు. ప్రశ్నోత్తరాలు జరగకుండా టీడీపీ అడ్డుకుంటోందని, సభను అడ్డుకోవడానికే వాళ్లు వచ్చినట్లు ఉందని మండిపడ్డారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. టీడీపీకి ప్రజలు ముఖ్యం కాదు.. ఆ ఘనత చంద్రబాబుదే: మంత్రి ఆర్కే రోజా
ద్యోగాల గురించి మాట్లాడే అర్హత అసలు టీడీపీకి ఉందా? అని నిలదీశారు ఏపీ పర్యాటక మంత్రి ఆర్కే రోజా. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన అనంతరం..  పది నిమిషాల వాయిదా సమయంలో ఆమె అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. పొలిటికల్‌ ట్విస్ట్‌.. పీకేతో నితీశ్‌ కుమార్‌ భేటీ, మధ్యవర్తిగా ఆయనే!
బీహార్‌ రాజకీయాలను వేదికగా చేసుకుని.. ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌లు గత కొన్నివారాలుగా మాటల తుటాలు పేల్చుకుంటున్నారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. పల్లెల్లో భేటీలతో ఏకతాటిపైకి.. ‘మునుగోడు’పై టీఆర్‌ఎస్‌ ప్రత్యేక వ‍్యూహం
 దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మునుగోడులో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ‘చంద్రబాబు ఇక శాశ్వతంగా అసెంబ్లీకి రాలేడు’
 టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇక శాశ్వతంగా అసెంబ్లీకి రాలేడని మున్సిపల్‌ శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. పుతిన్‌ కారుపై దాడి.. క్షేమంగా రష్యా అధ్యక్షుడు! అడ్రస్‌ లేకుండా పోయిన ప్రియురాలు
రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రయాణిస్తున్న కారుపై దాడి జరిగినట్లు  వచ్చిన వార్తలు తీవ్ర కలకలం సృష్టించాయి. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. చరిత్ర సృష్టించిన వినేశ్‌ ఫొగాట్‌
నాలుగు రోజుల నిరాశాజనక ప్రదర్శన అనంతరం ప్రపంచ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఐదో రోజు భారత్‌ ఖాతాలో తొలి పతకం చేరింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. లేట్‌ నైట్‌ అయినా సరే.. చిటికెలో డెలివరీ!
అర్ధరాత్రి సమయంలోనూ కిరాణా సరుకులు మీ ఇంటికి చేర్చే రోజు వస్తుందని ఊహించారా..? దీన్ని నిజం చేసింది స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. డైరెక్టర్‌ ఇంటిముందు నిర్మాత ధర్నా.. డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ డిమాండ్‌
 దర్శకుడు బాలా ఇంటి ముందు సినీ నిర్మాత ధర్నా చేయడం కోలీవుడ్‌లో కలకలం రేపింది. వివరాలు.. సేతు, పితామగన్, నంద వంటి పలు విజయవంతమైన చిత్రాల దర్శకుడు బాలా.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. కుబేరుల అడ్డాల గురించి తెలుసా? తక్కువ పన్నులు, హౌజ్‌ స్కీమ్‌లతో అక్కడికే ‘క్యూ’
ప్రపంచంలో అపర కుబేరుల అడ్డా జాబితా వెల్లడైంది. ఎక్కువగా ఉన్న నగరాల్లో న్యూయార్క్, టోక్యో, శాన్‌ ఫ్రాన్సిస్కో, లండన్‌ తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement