
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై అడయార్‌లోని ఫో ర్టీస్ మలర్ ఆస్పత్రిలో ఇటీవల సర్జరీలు చేయించుకున్న ఏపీఐఐసీ చైర్‌పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను బుధవారం ప్రముఖులు పరామర్శించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, తుడా చైర్మన్, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బుధవారం చెన్నైలోని ఆస్పత్రికి చేరుకుని ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో పునరంకితం కావాలని వైవీ సుబ్బారెడ్డి ఆకాంక్షించారు.