
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ఎంపీడీవో కార్యాలయాలు, గ్రామ–వార్డు సచివాలయాల్లో త్వరలో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పించనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ప్రభుత్వం ఇటీవల పంచాయతీరాజ్ శాఖలో కొత్తగా నియమించిన డివిజన్ లెవల్ డెవలప్‌మెంట్ అధికారులకు (డీఎల్‌డీవో) రెండ్రోజుల శిక్షణ తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి.
ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. సంక్షేమ కార్యక్రమాల అమలులో డీఎల్‌డీవోలు జిల్లాకు, గ్రామ–వార్డు సచివాలయాలకు మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరించాలని సూచించారు. వీరు రోజూ రెండు సచివాలయాలను సందర్శించి అక్కడ ఉన్న లోటుపాట్లను సరిదిద్దాలని సూచించారు. ఎంపీడీవోలకు త్వరలోనే పదోన్నతులను ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ గిరిజా శంకర్, గ్రామ–వార్డు సచివాలయాల శాఖ కమిషనర్ జీఎస్ నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment