
సాక్షి, విశాఖ: హత్యా రాజకీయాలు చేయడంలో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ సిద్ధహస్తుడని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఫైరయ్యారు. వంగవీటి రంగా హత్య కేసుతో సంబంధాలు ఉన్నవెలగపూడి.. అవినీతి తిమింగళమని ఆరోపించారు. ఎమ్మెల్యే వెలగపూడి, టీడీపీ అభ్యర్ది అమరేంద్ర ఇద్దరూ పూజకు పనికిరాని పువ్వులని ఎద్దేవా చేశారు. స్వతంత్ర అభ్యర్థి గౌస్ పవిత్రమైన మసీదును రాజకీయాలకు వాడుతున్నారని విమర్శించారు. గౌస్ తన అల్లుడు సహకారంతో బీహార్ ముఠాలను రంగంలోని దింపి హత్యా రాజకీయాలు నడుపుతున్నాడని ఆరోపించారు. గ్రేటర్ విశాఖకు ఖండాంతర ఖ్యాతి దక్కాలంటే వైఎస్సార్సీపీ అభ్యర్ది వంశీకృష్ణ శ్రీనివాస్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
జీవీఎంసీ పరిధిలోని పలు సమస్యలపై విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. సమస్యలు పరిష్కరించేందుకు అన్ని విధాల కృషి చేస్తానని హామినిచ్చారు. ఏయూలో పని చేస్తున్న టైమ్ స్కేల్ ఉద్యోగుల సమస్యలను వీసీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని, చిన వాల్తేరులో చేపల మార్కెట్ ఆధునీకరణ, ఒరిస్సా బ్రాహ్మణులకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం, వాల్తేరులో తాగునీటి సమస్యకు పరిష్కారం, గౌడ వీధిలో సామాజిక భవనం నిర్మాణం, ధోభీ ఘాట్ నిర్మాణం, పాండురంగాపురం ప్రజలకు ఇళ్ల స్థలాలు, గోశాల నిర్మాణం వంటి పలు హామీలను గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment