
తిరుమల: టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ ఓ శ్రీవారి భక్తురాలు శుక్రవారం ఈఓ జవహర్‌రెడ్డికి ఈ–మెయిల్ పంపారు. వివరాలు.. తెలంగాణ, హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరికి చెందిన నవత ఈనెల 6 తేదీ శ్రీవారి దర్శనానికి వచ్చితిరుమలలో మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నారు.
వెంటనే విజిలెన్స్ కంట్రోల్ రూమ్‌లో ఫిర్యాదు చేశారు. స్పందించి సిబ్బంది వెంటనే సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేసి గంటలోపు ఆమె మొబైల్ ఫోన్‌ను గుర్తించి అప్పగించారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. తాను ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పటి నుంచి ఫోన్ తనకు అప్పగించేంత వరకు విజిలెన్స్ కంట్రోల్ రూం సిబ్బంది ఎంతో గౌరవంగా, స్నేహ పూర్వకంగా వ్యవహరించారని అభినందిస్తూ శుక్రవారం ఈఓ జవహర్‌రెడ్డికి ఈ–మెయిల్ పంపారు.
Comments
Please login to add a commentAdd a comment